ఈ ఏడాది భారత వృద్ధి 7.5%
ఐఎంఎఫ్ తాజా నివేదిక
వాషింగ్టన్: భారత్ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి చేరుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) పేర్కొంది. ఈ ఏడాది చైనా జీడీపీ కన్నా భారత జీడీపీ 1 శాతం అధికంగా ఉంటుందని తన తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదికలో ఐఎంఎఫ్ తెలిపింది. ప్రైవేట్ వినియోగం జోరుగా ఉండడం, పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడం దీనికి ప్రధాన కారణాలని వివరించింది. గత ఏడాది అక్టోబర్ అంచనాలనే ఐఎంఎఫ్ కొనసాగించింది. భారత్‌లో ద్రవ్య పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయని, 5 శాతం కంటే దిగువగానే ద్రవ్యోల్బణం ఉందని పేర్కొంది. అయితే ప్రతికూలమైన వర్షపాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగడం...ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించింది.