నేటి నుంచే పవర్‌మెక్ ఇష్యూ | In today's issue from the Power Mech | Sakshi
Sakshi News home page

నేటి నుంచే పవర్‌మెక్ ఇష్యూ

Published Fri, Aug 7 2015 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

నేటి నుంచే పవర్‌మెక్ ఇష్యూ

నేటి నుంచే పవర్‌మెక్ ఇష్యూ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బుక్ బిల్డింగ్ పద్థతిలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పవర్‌మెక్ యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 82 కోట్లు సమీకరించింది. మొత్తం ఈ ఇష్యూ ద్వారా 42.69 లక్షల షేర్లు జారీ చేస్తుండగా అందులో 12.80 లక్షల షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లైన వివిధ మ్యూచువల ఫండ్ సంస్థలకు కేటాయించింది. ఇష్యూ ప్రైస్ బాండ్‌ను రూ. 615 - 640గా నిర్ణయించగా యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 640 చొప్పున ఈ కేటాయింపులు చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ వాటాలో ఐడీఎఫ్‌సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్ అత్యధికంగా ఇన్వెస్ట్ చేయగా, ఆ తర్వాతి స్థానాల్లో డీఎస్‌పీ బ్లాక్‌రాక్ టైగర్ ఫండ్, ఎస్‌బీఐ స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement