•2020 కల్లా 1,500 కోట్ల డాలర్లకు
•నాస్కామ్-డెలాయిట్ నివేదిక
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్(ఐఓటీ) మార్కెట్ భారత్‌లో జోరుగా పెరగనున్నదని నాస్కామ్ అంచనా వేస్తోంది. తయారీ, వాహన, రవాణా, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో ఐఓటీ అనువర్తనం కారణంగా భారత్‌లో ఐఓటీ మంచి వృద్ధిని సాధిస్తుందని డెలాయిట్‌తో నాస్కామ్ రూపొందించిన నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న పరికరాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్న నెట్‌వర్క్‌ను ఐఓటీ అంటారు. ఉదాహరణకు, రోడ్ల మీద ఎలాంటి ట్రాఫిక్ లేకపోతే వీధిలైట్లు వాటంతట అవే ఆఫ్ అయిపోతాయి. ఫలితంగా విద్యుత్తు ఆదా అవుతుంది. వినియోగదారుల, పారిశ్రామిక రంగాల్లో ఐఓటీ వినియోగం ప్రారంభమైందని ఐఓటీని ఆవిష్కరించిన కెవిన్ ఆష్టన్ పేర్కొన్నారు.
ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు...
ప్రస్తుతం 560 కోట్ల డాలర్లుగా ఉన్న ఐఓటీ మార్కెట్ 2020 కల్లా 1,500 కోట్ల డాలర్లకు పెరుగుతుంది. వివిధ రంగాలకు చెందిన 120కు పైగా సంస్థలు ఐఓటీ ఈకో సిస్టమ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది 20 కోట్ల యూనిట్లతో అనుసంధానమై ఉన్న భారత ఐఓటీ మార్కెట్ 2020 కల్లా 270 కోట్ల యూనిట్లకు పెరుగుతుంది. ఇదే తరహా వృద్ధి ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని అంచనా. ఐఓటీ వృద్ధికి వినియోగదారుల, పారిశ్రామిక రంగాలు చోదక శక్తిగా పనిచేస్తాయి.
జోరుగా భారత ఐఓటీ మార్కెట్
Published Thu, Oct 6 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
Advertisement
Advertisement