మనవాళ్లకి ఆ ప్రకటనలంటే తెగ చిరాకట
మొబైల్ వ్యాపారప్రకటనలు చాలా మంది భారతీయులకు బాధించేవిగా, మూర్ఖమైనవిగా ఉంటున్నాయట. 60శాతం మంది భారతీయులు మొబైల్ వ్యాపారప్రకటనలను చిరాగ్గా భావిస్తున్నట్టు సర్వేలు తెలిపాయి. మొబైల్ అడ్వర్ టైజింగ్ లో పాప్ -అప్ లు, వీడియో ప్రకటనలు మరింత బాధపెడుతున్నాయని 55శాతం మంది రెస్పాడెంట్లు అభిప్రాయాలు వ్యక్తంచేశారు. స్మార్ట్ ఫోన్లు వాడుతున్న జెనరేషన్ ఎక్స్, జెనరేషన్ వై, మిలినియల్స్ ను టార్గెట్ గా చేసుకుని మొబైల్ కాల్ యాప్ 'నాను' సర్వే నిర్వహించింది. 3,375 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. 46 మంది కావాలనే ప్రకటనలు ఆపివేశారని సర్వే కనుగొంది.
80శాతం మంది పాప్-అప్ లను, వీడియో అడ్వర్ట్స్ లను క్లిక్ చేయడమే నివారిస్తున్నారని తెలిపింది. అసలు మొబైల్ ప్రకటన ద్వారా కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారా..? అని 75శాతం మంది సర్వేల్లో సందేహాలు వ్యక్తంచేశారని ఈ సర్వే పేర్కొంది. బ్రాండ్స్ కు ప్రకటనలు చేసేందుకు ప్రకటన దారులు ఎంచుకున్న ఈ పద్ధతులు అనుచిత స్వభావాన్ని కలిగి ఉంటున్నాయట. దీంతో యూజర్లను ఆకట్టుకోలేకపోతున్నాయని నాను యాప్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ తెలిపారు. అయితే మొబైల్ అడ్వర్ టైజింగ్ లు అనుచితంగా ఉండకపోతే, యూజర్లకు, బ్రాండ్లకు ఉపయోగకరమైనవిగా ఉంటాయని తాము విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. మొబైల్ వ్యాపార ప్రకటనలు హానికరమైనవిగా ఉంటుండంతో, యాప్ బ్లాకింగ్ సాప్ట్ వేర్ ను అధిక సంఖ్యలో యూజర్లు వాడుతున్నట్టు సర్వేలో తేలింది.