
న్యూఢిల్లీ: భారత్ తనకున్న సామర్థ్యం మేరకు 8–9 శాతం వృద్ధి రేటును సాధించాలంటే మరిన్ని ఆర్థిక సంస్కరణలు అవసరమని ప్రఖ్యాత ఆర్థిక వేత్త, నోబెల్ అవార్డు గ్రహీత నోరీల్ రూబిని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కె ట్లో చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు, ద్రవ్యలోటు సమస్యలను భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘‘భారత్‌కు దీర్ఘకాలంలో ఉజ్వల భవిష్యత్తు ఉంది. మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి.
అలాగే, స్థూల ఆర్థిక అంశాల స్థిరీకరణ అవసరం. దీంతో ఏడు శాతానికి పైనే 8–9 శాతం స్థాయిలో వృద్ధి రేటును సాధించగలదు’’అని రూబిని చెప్పారు. గురువారం ఢిల్లీలో భారత ఆర్థిక వ్యవస్థపై జరిగిన ఓ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో బ్యాంకింగ్ రంగ నిర్వహణ విధానాన్ని మార్చాల్సి ఉందని రూబిని అభిప్రాయపడ్డారు. బ్యాంకులు ఎన్‌పీఏలకు తగినంత నిధులు కేటాయిం చాలని లేదా దీనికోసం ప్రత్యేకంగా అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఏర్పాటు చేయాలని సూచించారు.