ఇండిగో 24 కొత్త విమానాలు | IndiGo announces 24 new flights, to expand its domestic network | Sakshi
Sakshi News home page

ఇండిగో 24 కొత్త విమానాలు

Published Thu, Jan 7 2016 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

ఇండిగో 24 కొత్త విమానాలు

ఇండిగో 24 కొత్త విమానాలు

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో దేశీ నెట్‌వర్క్ పరిధిలోకి 24 కొత్త విమానాలను తీసుకువచ్చినట్లు ప్రకటించింది. ఇండిగో కంపెనీ జనవరి 7 నుంచి ఢిల్లీ- త్రివేండ్రం, బెంగళూరు-విశాఖపట్నం, బెంగళూరు- భువనేశ్వర్, అహ్మదాబాద్- బెంగళూరు, భువనేశ్వర్-కోల్‌కతా, చెన్నై-త్రివేండ్రం మధ్య 12 కొత్త ఫ్లైట్స్‌ను నడపనుంది.
 
  ఇక జనవరి 14 నుంచి చెన్నై-హైదరాబాద్‌కు 6వ డైలీ నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను నడుపుతామని కంపెనీ తెలియజేసింది. వీటికి అదనంగా జనవరి 15 నుంచి బెంగళూరు-కోల్‌కతా, ఢిల్లీ-అహ్మదాబాద్, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-కోల్‌కతా, హైదరాబాద్-ముంబై ప్రాంతాలకు అదనంగా మరో 10 ఫ్లైట్లను నడపనుంది.  ఢిల్లీ-త్రివేండ్రం-ఢిల్లీ మధ్య డైలీ నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో దేశీ విమాన నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తామని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ ఈ సందర్భంగా చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement