ఇండిగో ప్రెసిడెంట్‌ గుడ్‌బై | Aditya Ghosh Resigns As IndiGo President | Sakshi
Sakshi News home page

ఇండిగో ప్రెసిడెంట్‌ గుడ్‌బై

Published Mon, Apr 30 2018 12:04 PM | Last Updated on Mon, Apr 30 2018 12:05 PM

Aditya Ghosh Resigns As IndiGo President - Sakshi

ఆదిత్య ఘోష్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ సంస్థ  ఇండిగో గ్లోబ్‌ ఏవియేషన్ లిమిటెడ్  ప్రెసిడెంట్‌ రాజీనామా చేశారు.  2008 నుండి అధ్యక్షపదవిలో కొనసాగిన  ఆదిత్య ఘోష్‌ తన పదవికా రాజీనామా చేశారు. దీంతో పదేళ్ళపాటు సంస్థతో కలిసిచేసిన  ఘోష్‌తో అనుబంధం  జూలై 31వ తేదీతో ముగియనుంది. అలాగే   ఇండిగో ప్రెసిడెంట్‌, సీఈవో పదవికి  వైమానిక రంగ నిపుణుడైన గ్రెగర్‌ టేలర్‌  పేరును పరిశీలిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.   మరోవైపు రాహుల్ భాటియాను మధ్యంతర  సీఈవో గా నియమించినట్టు ఇండిగో  ఒక ప్రకటనలో తెలిపింది.  అయితే రాజీనామాకు గల కారణాలను అటు ఘోష్‌ గానీ, ఇటు ఇండిగో సంస్థ వెల్లడి చేయలేదు.  సమీప భవిష్యత్తులో "తరువాతి అడ్వెంచర్" కు అధిరోహించనున్నానని మాత్రం ఘోష్ వ్యాఖ్యానించారు.  2007 మే 30 న ఘోష్‌ సీనియర్‌ అడ్వైజర్‌గా ఇండిగో బోర్డులో చేరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement