రూ. 899కి విమాన టికెట్‌ | IndiGo announces monsoon sale, offering special airfare Rs 899 onwards | Sakshi
Sakshi News home page

రూ. 899కి విమాన టికెట్‌

Published Tue, Jun 13 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

రూ. 899కి విమాన టికెట్‌

రూ. 899కి విమాన టికెట్‌

ఇండిగో వర్షాకాల ఆఫర్‌
చెన్నై: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో తాజాగా వర్షాకాల స్పెషల్‌ కింద ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో ప్రయాణానికి టికెట్‌ చార్జీలు రూ. 899 నుంచి ఉంటాయని తెలిపింది. హైదరాబాద్‌–ముంబై, కోల్‌కతా–అగర్తలా తదితర 39 రూట్లలో ఈ చార్జీలకు టికెట్లు పొందవచ్చని పేర్కొంది.

జూన్‌ 12న మొదలైన ఆఫర్‌ 14 దాకా మూడు రోజులపాటు కొనసాగుతుంది. జూలై 1 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య కాలంలో ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఈ టికెట్లు నాన్‌రిఫండబుల్‌గా ఉంటాయి. వేసవి ఆఫర్లకు మంచి స్పందన లభించిన నేపథ్యంలో వర్షాకాల ఆఫర్‌ ప్రకటించినట్లు ఇండిగో చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement