ఇండిగో బంపర్‌ ఆఫర్‌ ఏంటో తెలుసా? | IndiGo offers tickets starting Rs 1111 to mark 11th anniversary; international destinations included in scheme | Sakshi
Sakshi News home page

ఇండిగో బంపర్‌ ఆఫర్‌ ఏంటో తెలుసా?

Published Wed, Aug 2 2017 4:13 PM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

ఇండిగో బంపర్‌ ఆఫర్‌ ఏంటో తెలుసా?

ఇండిగో బంపర్‌ ఆఫర్‌ ఏంటో తెలుసా?

న్యూఢిల్లీ:  దేశీయ  ప్రయివేట్‌ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ మరోసారి విమాన టికెట్లలో తగ్గింపు ధరలను ప్రకటించింది.  ముఖ్యంగా  సంస్థ 11వ  వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని  భారీ డిస్కౌంట్‌ ధరలను ప్రకటించింది. రూ.1111నుంచి ప్రారంభమయ్యే   టికెట్లను ఆఫర్‌ చేస్తోంది.  అన్ని ట్యాక్స్‌లతో కలిపి టిక్కెట్లను విక్రయించనున్నట్టు  ఇండిగో వెల్లడించింది. అంతేకాదు ఈ తాజా  ఆఫర్‌ను  కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు వర్తింపచేయడం విశేషం.

 ఈ ఆఫర్‌లో ఈ రోజు  (ఆగస్టు 2 )నుంచి ఆగస్టు 6 వరకు టికెట్ల బుకింగ్‌ అందుబాటులో ఉండనున్నాయి.  ఇలా బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా ఆగస్టు 21 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 వరకు ప్రయాణించవచ్చు.  దేశంలో మొత్తం 45 ప్రాంతాలకు ఈ ఆఫర్‌ను వర్తింపజేసింది. అంతేకాదు మొబీక్విక్‌ వ్యాలెట్‌ ద్వారా టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నట్టయితే మరో 11 శాతం ఆఫర్‌ ఇస్తోంది. ఈ ఆఫర్ కింద, www.goindigo.in లేదా ఇండిగో మొబైల్ యాప్‌తో  బుక్‌ చేసుకుంటే  11 శాతం  సూపర్‌క్యాఫ్‌ బ్యాక్‌ ఆఫర్‌ అందిస్తోంది.   సుమారు రూ. 600 రూపాయల  దాకా ఈ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌  అందిస్తుంది. అన్ని బుకింగ్‌ ఛానెళ్లలోనూ ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటాయనీ,అయితే  నాన్‌స్టాప్‌ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని ఇండిగో ఒకప్రకటనలో తెలిపింది.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తా లాంటి మెట్రో నగరాలతోపాటు ,  చిన్న నగరాలు - భువనేశ్వర్, చండీగఢ్, పూణె, అహ్మదాబాద్ లోని ఈ ఇక్కడ ఇండిగో విమానాల జాబితాలో ఉన్నాయి.  అంతేకాదు  షార్జా, సింగపూర్, మస్కట్, దుబాయ్, దోహా, పోర్ట్‌బ్లెయిర్‌ వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఇండిగో తాజా పథకం కూడా చెల్లుతుంది.

 అగర్తలా, అహ్మదాబాద్‌, అమృత్‌సర్‌, బ్యాంకాక్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, ఛండీగఢ్‌, చెన్నై, కోయంబత్తూరు, డెహ్రాడూన్‌, దిల్లీ, డిబ్రుఘడ్‌,  గోవా, గువాహటి, హైదరాబాద్‌, ఇంఫాల్‌, ఇండోర్‌, జైపూర్‌, జమ్మూ, కోచి, కోల్‌కతా, కోజికోడ్‌, లక్నో, మధురై, మంగుళూరు, ముంబయి,  నాగపూర్‌,  పుణె, రాయిపూర్‌, రాంచీ,  శ్రీనగర్‌, తిరువనంతపురం, ఉదయ్‌పూర్‌, వడోదర, వారణాసి, విశాఖపట్నం లో ఈ  టిక్కెట్లు బుక్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement