10 శాతం స్టార్టప్‌లే విజయం సాధిస్తాయి...
ఇన్ఫీ మాజీ డెరైక్టర్ మోహన్‌దాస్ పాయ్
ముంబై: స్టార్టప్‌ల జోరు బాగా ఉన్నప్పటికీ, 10 శాతం స్టార్టప్‌లే విజయం సాధిస్తాయని ఇన్ఫోసిస్ మాజీ డెరైక్టర్ టి. వి. మోహన్‌దాస్ పాయ్ చెప్పారు. 25% స్టార్టప్‌లు అంతంత మాత్రం ఫలితాలస్తాయని, మిగిలిన స్టార్టప్‌లు విఫలమవుతాయని అంచనావేశారు. స్టార్టప్‌లకు సంబంధించి అనువైన విధానాలను ప్రభుత్వం తీసుకొస్తే, భారీ స్థాయిలో ఉద్యోగాలిచ్చే దిశగా స్టార్టప్‌లు అవతరిస్తాయని వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా సాకారమైతే పదేళ్లలో లక్ష స్టార్టప్‌లు వస్తాయని, 35 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. 50 వేల కోట్ల డాలర్ల టర్నోవర్ సాధించవచ్చని వివరించారు. ప్రస్తు తం భారత్‌లో 18 వేల స్టార్టప్‌లు ఉన్నాయని, 3 లక్షల మంది పనిచేస్తున్నారని, ఈ స్టార్టప్‌ల విలువ 7,500 కోట్ల డాలర్లని వివరించారు.