
స్టాక్ మార్కెట్లపై ఇన్ఫోసిస్ దెబ్బ
ఇన్ఫోసిస్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు 300 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తితోపాటు నందన్‌నిలేకని ఆయన కుటుంబసభ్యులు కలిసి మొత్తం 6 వేల 481కోట్ల రూపాయల విలువైన 33 మిలియన్ షేర్లను అమ్మివేశారు. డాయిచీ బ్యాంక్ ద్వారా ఈ అమ్మకాలు జరిగాయి. ఒక్కో షేరు విలువ 1988 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఇందులో నందన్‌నిలేకని, నారాయణ మూర్తి కుంటుంబాలు కలిసి 4771 కోట్ల రూపాయల 12 మిలియన్ల షేర్లు అమ్మగా, మరో ఉన్నతాధికారి దినీష్ కృష్ణమూర్తి, అయన కుటుంబం 1232 కోట్ల రూపాయల విలువైన షేర్ల అమ్మకాలు జరిపింది.
ఇక కుమారి షిబాబుల్ 477 కోట్ల రూపాయల విలువైన 2.4 మిలియన్ల షేర్లు అమ్మకాలు జరిపారు . మొత్తం దాదాపుగా 39.6 మిలియన్ ఈక్విటీ షేర్ల అమ్మకాలు జరిగాయి. ఈ దెబ్బ భారతీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. ఇన్ఫోసిస్ షేరు దాదాపుగా 5 శాతం దాకా పడిపోయింది. ఇన్ఫోసిస్ మొత్తంలో నారాయణ మూర్తి కుటుంబానికి 8 శాతం వాటాలు ఉన్నాయి.
**