అంచనాలను దాటేసిన ఇన్ఫీ
సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ అంచనాలను మించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికానికి (జనవరి-మార్చి) 25 శాతం వృద్ధిని చూపించింది. 2,992 కోట్ల నికర లాభం సాధించింది. నాలుగో త్రైమాసికానికి కన్సాలిడేట్ రెవెన్యూ కూడా 23 శాతం పెరిగింది. ఇది ఏడాది క్రితం రూ. 10,454 కోట్లు ఉండగా ఇప్పుడు రూ. 12,875 కోట్లు అయ్యింది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్ (ఐఎఫ్ఆర్ఎస్) ప్రకారం చూస్తే, ఇన్ఫోసిస్ నికర ఆదాయం 9.7 శాతం పెరిగింది. స్థూల ఆదాయం 7.9 శాతం పెరిగింది.
రెలిగేర్ లాంటి ఆర్థిక సంస్థలు ఇన్ఫోసిస్ ఆదాయానికి సంబంధించిన గైడెన్స్ మహా అయితే 7-9% మాత్రమే ఉంటుందని అంచనా వేయగా, అది గత సంవత్సరం కంటే దాటి 13 శాతంగా నమోదైంది. దీంతో ఈసారి ఇన్ఫోసిస్ పని అయిపోయినట్లేనంటూ కొందరు పండితులు చేసిన వ్యాఖ్యలు తప్పని తేలిపోయాయి. నారాయణమూర్తి మళ్లీ పగ్గాలు చేపట్టడంతో ఆట్రిషన్ ఎలా ఉన్నా ఫలితాలు మాత్రం బాగానే ఉండటం గమనార్హం.