ఐటీసీ నికర లాభం 18% అప్ | ITC Q4 net profit up 18 percent, sales volumes fall | Sakshi
Sakshi News home page

ఐటీసీ నికర లాభం 18% అప్

Published Sat, May 24 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

ఐటీసీ నికర లాభం 18% అప్

ఐటీసీ నికర లాభం 18% అప్

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ జనవరి-మార్చి(క్యూ4) కాలానికి రూ. 2,278 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,928 కోట్లతో పోలిస్తే ఇది 18%పైగా వృద్ధి. ఇక నికర అమ్మకాలు సైతం దాదాపు 12% పెరిగి రూ. 9,145 కోట్లను దాటాయి. గతంలో రూ. 8,180 కోట్ల ఆదాయం నమోదైంది. స్టాండెలోన్ ఫలితాలివి. మొత్తం వ్యయాలు 8%పైగా తగ్గి రూ. 5,273 కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ తెలిపింది.

 సమస్యాత్మక బిజినెస్ వాతావరణంలోనూ మంచి ఫలితాలను సాధించగలిగినట్లు వ్యాఖ్యానించింది. కాగా, సిగరెట్లు తదితర ఎఫ్‌ఎంసీజీ బిజినెస్ ఆదాయం దాదాపు 13% ఎగసి రూ. 4,079 కోట్లకు చే రగా, సిగరెట్లేతర విభాగం నుంచి 14% అధికంగా రూ. 2,315 కోట్లు లభించింది. పూర్తి  ఏడాదికి(2013-14) నికర లాభం 17% పుంజుకుని రూ. 8,891 కోట్లను అధిగమించింది. ఇక నికర అమ్మకాలు దాదాపు 12% ఎగసి రూ. 34,985 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 0.8% నష్టపోయి రూ. 342 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement