Net sales
-
బజాజ్ ఫిన్సర్వ్ సేల్స్ ఢమాల్
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫిన్సర్వ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 31 శాతం క్షీణించి రూ. 833 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,215 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 14,192 కోట్ల నుంచి రూ. 13,949 కోట్లకు బలహీనపడింది. సొంత అనుబంధ సంస్థలు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ అలయెంజ్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయెంజ్ లైఫ్ ల ఉమ్మడి పనితీరుతో వెల్లడించిన ఫలితాలివి. ఫైనాన్స్ ఓకే: అనుబంధ సంస్థలలో బజాజ్ ఫైనాన్స్ నికర లాభం 4 శాతంపైగా ఎగసి రూ. 1,002 కోట్లను తాకగా.. జనరల్ ఇన్సూరెన్స్ లాభం 8.4 శాతం క్షీణించి రూ. 362 కోట్లకు పరిమితమైంది. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం లాభం 35 శాతం పైగా వెనకడుగుతో రూ. 84 కోట్లకు చేరింది. -
ఎల్ అండ్ టీ లాభం రూ.996 కోట్లు
* 16% వృద్ధి * ఆదాయం 11% అప్ న్యూఢిల్లీ: ఎల్ అండ్ టీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 16 శాతం వృద్ధి చెందింది. గత క్యూ2లో రూ.862 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.996 కోట్లకు పెరిగిందని ఎల్ అండ్ టీ తెలిపింది. నికర అమ్మకాలు రూ. 21,159 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ. 23,393 కోట్లకు, కన్సాలిడేటెడ్ స్థూల ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.23,605 కోట్లకు పెరిగి నట్లు వివరించింది. మొత్తం ఆదాయంలో అంతర్జాతీయ కార్యకలాపాల ఆదాయం రూ.7,658 కోట్లని(32%) పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.19,374 కోట్ల నుంచి రూ.21,495 కోట్లకు ఎగిశాయని తెలిపింది. ఈ క్యూ2లో రూ.28,620 కోట్ల తాజా ఆర్డర్లు సాధించామని, వీటిల్లో 38 శాతం(రూ.10,973 కోట్లు) విదేశాల నుంచి వచ్చినవేనని తెలిపింది. ఈ ఏడాది 30 నాటికి కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ 14 శాతం వృద్ధితో రూ.2,44,097 కోట్లకు చేరిందని వివరించింది. లాభదాయక ప్రాజెక్టులపైనే దృష్టి ఈ క్యూ2లో పెట్టుబడుల వాతావరణం మందగమనంలో ఉందని కంపెనీ తెలిపింది. ఫైనాన్షియల్ మార్కెట్లు ఒడిదుడుకులమయంగా ఉన్నాయని, వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడానికి కొంత సమయం పడుతుందని పేర్కొంది. తమ ఆర్డర్ బుక్ భారీగా ఉందని, లాభదాయక ప్రాజెక్టులపైననే దృష్టి కేంద్రీకరిస్తున్నామని, ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటే మంచి వృద్ధిని సాధించగలమని ధీమా వ్యక్తం చేసింది. -
స్టాక్స్ వ్యూ
క్యాడిలా హెల్త్‌కేర్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.1,813 టార్గెట్ ధర: రూ.2,200 ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో కంపెనీ నికర అమ్మకాలు 22% వృద్ధితో రూ.2,500 కోట్లకు, నికర లాభం 47% వృద్ధితో రూ.353 కోట్లకు పెరిగాయి. స్థూల లాభం 78 శాతం వృద్ధితో రూ.533 కోట్లకు ఎగసింది. నికర లాభం మార్జిన్ 242 బేసిస్ పాయింట్లు, ఇబిటా మార్జిన్ 604 బేసిస్ పాయింట్లు చొప్పున వృద్ధి చెందాయి. ఇతర ఆదాయం వంద శాతం ఎగసి రూ.21 కోట్లకు పెరిగింది. భారత ఫార్ములేషన్స్ మార్కెట్లో 12 కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. అమెరికా ఫార్ములేషన్స్ వ్యాపారం 37 శాతం వృ ద్ధి సాధించింది. ఈ క్యూ1లో ఒక కొత్త ఔషధాన్ని అమెరికా మార్కెట్లోకి తెచ్చింది. ఆరు ఏఎన్‌డీఏ(అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్)లను అమెరికా ఎఫ్‌డీఏకు సమర్పించింది. కీళ్లనొప్పులు, క్యాన్సర్, ఇన్ఫెర్టిలిటీ, గుండెపోటుకు సంబంధించి 25 బయోలాజిక్స్ ఔషధాలు పరిశోధన, అభివృద్ధి దశలో ఉన్నాయి. మరిన్ని బయోలాజిక్స్పై రీసెర్చ్ కార్యకలాపాలు జోరుగా ఉన్నాయి. తొలి దశ బయోసిమిలర్స్‌పై అంతర్జాతీయంగా క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఆసియా పసిఫిక్, ఆఫ్రికా, పశ్చిమాసియా వంటి కీలక మార్కెట్లలో తన బ్రాండెడ్ జనరిక్ వ్యాపారాన్ని ఏకీకృతం చేసింది. రెండేళ్లలో నికర అమ్మకాలు 15 శాతం, నికర లాభం 27 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.70గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.81గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. మధ్య నుంచి దీర్ఘకాలానికి రూ.2,200 టార్గెట్ ధరకు ఈ షేర్‌ను ప్రస్తుత ధరలో కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం. యస్ బ్యాంక్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ప్రస్తుత ధర: రూ.646 టార్గెట్ ధర: రూ.1,075 ఎందుకంటే: ప్రైవేట్ రంగంలో ఐదో అతి పెద్ద బ్యాంక్. 2004 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 29 రాష్ట్రాల్లో, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉంది. 375 నగరాల్లో 630 బ్రాంచీలు, 1,150కు పైగా ఏటీఎంతో బ్యాంకింగ్ సేవలందిస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఉన్న అధిక ధర నుంచి యస్ బ్యాంక్ షేర్ 35% పతనమైంది. ప్రస్తుత ధర వద్ద కొనుగోళ్లకు ఆకర్షణీయమేనని చెప్పవచ్చు. బ్యాంక్ రుణ నాణ్యత, విదేశీ రుణాలపై చెలరేగిన ఆందోళన సద్దుమణిగింది. మొండి బకాయిలు, రుణ రేట్లకు సంబంధించి ప్రతికూల అంచనాలేమీ లేవు. విదేశీ రుణాలపై వచ్చిన మార్క్ టు మార్కెట్ నష్టాలను భర్తీ చేసుకునేలా తగినంత స్వాప్ స్ట్రక్చర్ బ్యాంక్‌కు ఉంది. మార్జిన్లు ఆరోగ్యకరంగానే ఉంటాయని, రుణ వృద్ధి పోటీ బ్యాంకులతో పోల్చితే మెరుగ్గానే ఉంటుందని అంచనా వేస్తున్నాం. కాసా, రిటైల్ టర్మ్ డిపాజిట్లు ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. మార్జిన్లు ప్రస్తుతమున్న స్థాయిల్లోనే (3.2%) ఉండొచ్చని భావిస్తున్నాం. ఎంఎస్ఎంఈ, ఎస్ఎంఈ రుణాల విషయంలో యెస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకుల వాటా మరింతగాపెరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన నిధుల కొరత ఉండడమే దీనికి కారణం. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి వంద కోట్ల డాలర్లు ఏడీఆర్ రూపంలో సమీకరించాలని యోచిస్తోంది. ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ పుస్తక విలువ రూ.70 పెరుగుతుంది. కెన్‌ఫిన్ హోమ్స్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: సీడీ ఈక్విసెర్చ్ ప్రస్తుత ధర: రూ. 740 టార్గెట్ ధర: రూ. 865 ఎందుకంటే: ఒక బ్యాంక్ స్పాన్సర్ చేసిన తొలి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది. కెనరా బ్యాంక్ భాగస్వామ్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో నికర వడ్డీ ఆదాయం 75% వృద్ధితో రూ.64 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 3 శాతానికి పెరిగింది. మొత్తం నిర్వహణ ఆదాయం 65% వృద్ధితో రూ.70 కోట్లకు, నికర లాభం 69% పెరిగి రూ.32 కోట్లకు చేరాయి. రెండేళ్లలో ఏటా 33% చొప్పున వృద్ధి సాధిస్తుందని అంచనా. గృహ, గృహేతర రుణాలకు సంబంధించి మొత్తం 16 రకాల రుణాలను అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.276 కోట్ల నిధులు సమీకరించింది. ఈ నిధులతో వచ్చే ఆర్థిక సంవత్సరం వరకూ మూలధన అవసరాలు తీరతాయి. అందుబాటు ధరల్లో అందరికీ గృహాలందించాలన్న ప్రభుత్వ లక్ష్యం, అందుకనుగుణంగా వస్తున్న నియమ నిబంధనలు, ఈ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తుండడం, ఉద్యోగావకాశాలు పెరుగుతుండడం, వేతనాలు, పట్టణీకరణ, చిన్న కుటుంబాలు పెరుగుతుండడం, తక్కువ వడ్డీరేట్లకే రుణాలు లభిస్తుండటం, ద్రవ్యోల్బణం తగ్గుతుండటం... ఈ నేపధ్యంలో హౌసింగ్ ఫైనాన్స్ రంగం భవిష్యత్ బాగా ఉంటుందని భావిస్తున్నాం. -
నిరోధ శ్రేణి 28,420-28,580
మార్కెట్ పంచాంగం రుతుపవనాల బలహీనత, సంస్కరణల బిల్లుల స్తంభన వంటి ప్రతికూల అంశాల్ని ఎదుర్కొంటూ గరిష్టస్థాయిలో మన మార్కెట్ స్థిరపడినా, నాటకీయంగా చైనా తన కరెన్సీని డీవాల్యూ చేయడంతో అన్ని ప్రపంచ సూచీలతో పాటు సెన్సెక్స్, నిఫ్టీలు కూడా పడిపోయాయి. అయితే వారాంతంలో ఒక్క భారత్ మార్కెట్ మాత్రమే పటిష్టంగా కోలుకోవడం విశేషం. కానీ చాలా వారాల తర్వాత క్రితం వారం విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకాలు జరపడం ఆందోళనకరం. వీరు తిరిగి నికర కొనుగోళ్లకు ఉపక్రమిస్తేనే మార్కెట్ మరింత పెరిగే అవకాశం వుంటుంది. ఇక మన సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... గత మార్కెట్ పంచాంగంలో సూచించిన 28,130 పాయింట్ల స్థాయిని దిగువవైపుగా ఛేదించిన బీఎస్ఈ సెన్సెక్స్ అంచనాలకు అనుగుణంగా 27,480 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరిరోజైన శుక్రవారం పెద్ద ర్యాలీ జరపడంతో వారంలో నష్టాలను చాలావరకూ పూడ్చుకున్న సెన్సెక్స్ తుదకు 28,067 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగితే 28,420 పాయింట్ల వద్ద తొలి అవరోధం ఏర్పడవచ్చు. అటుపైన ముగిస్తే వేగంగా 28,580 వద్దకు చేరవచ్చు. గతవారం సెన్సెక్స్‌ను నిరోధించిన 28,420 పాయింట్లు, కొద్ది నెలలుగా అవరోధిస్తున్న 28,580 పాయింట్ల మధ్య శ్రేణిని బలంగా ఛేదిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఆపైన స్థిరపడితే కొద్ది రోజుల్లో 29,095 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. ఈ వారం ప్రస్తుత స్థాయి నుంచి లేదా పైన పేర్కొన్న నిరోధ శ్రేణి నుంచి వెనుదిరిగితే వెనువెంటనే 27,790 పాయింట్ల మద్దతుస్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున తిరిగి 27,400 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ నిరోధశ్రేణి 8,620-8,655 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,338 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమై, అటుతర్వాత వేగంగా 8,500 స్థాయిపైకి కోలుకోగలిగింది. చివరకు 46 పాయింట్ల నష్టంతో 8,519 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు నెలలుగా 8,300 పాయింట్ల సమీపంలో పలుదఫాలు మద్దతును 8,620-8,655 పాయింట్ల శ్రేణి వద్ద పదే పదే నిరోధాన్ని చవిచూస్తున్నందున, రానున్న వారాల్లో ఈ స్థాయిలు నిఫ్టీ దీర్ఘకాలిక ట్రెండ్‌కు ముఖ్యమైనవి. ఈ వారం ప్రస్తుత స్థాయి వద్ద నిఫ్టీ నిలదొక్కుకుంటే 8,620 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. అటుపైన 8,655 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. సమీప భవిష్యత్తులో ఈ స్థాయిని అధిగమిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ స్థాయిని దాటితే 8,760 పాయింట్ల స్థాయికి వేగంగా పెరగవచ్చు. అటుపైన స్థిరపడితే ఏప్రిల్ 15నాటి గరిష్టస్థాయి 8,845 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ప్రస్తుత స్థాయి వద్ద నిఫ్టీ స్థిరపడలేకపోతే 8,430 పాయింట్ల వద్దకు ఈ వారం క్షీణించవచ్చు. ఆ లోపున తిరిగి 8,320-8,370 పాయింట్ల మద్దతు శ్రేణి వద్దకు పతనం కావొచ్చు. ఆ లోపున 8,195 స్థాయికి క్షీణించే ప్రమాదం వుంది. -
12% పెరిగిన గోద్రెజ్ కన్సూమర్ నికర లాభం
- నికర అమ్మకాలు 8 శాతం అప్ - షేర్‌కు రూ.2.5 నాలుగో మధ్యంతర డివిడెండ్ న్యూఢిల్లీ: గోద్రెజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్(జీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.266 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నికర లాభం(రూ.236 కోట్లు)తో పోల్చితే 12 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. నికర అమ్మకాలు రూ.1,924 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.2,083 కోట్లకు పెరిగాయని గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ చెప్పారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.760 కోట్ల నుంచి రూ.907 కోట్లకు, నికర అమ్మకాలు రూ.7,583 కోట్ల నుంచి రూ.8,242 కోట్లకు పెరిగాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి నాలుగో మధ్యంతర డివిడెండ్‌గా షేర్‌కు రూ.2.5 ఇవ్వనున్నామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కంటే తర్వాతి ఆరు నెలల్లో మంచి పనితీరు కనబరిచామని వివరించారు. భారత్‌లో ఎఫ్ఎంసీజీ వృద్ధి కారణంగా మంచి వ్యాపారం సాధించామని వివరించారు. నవ కల్పనలకు, బ్రాండ్ బిల్డింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చామని, ఫలితంగా మంచి అమ్మకాలు సాధించామని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేనున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ ఎన్ఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ.1,098 వద్ద ముగిసింది. -
ఐటీసీ నికర లాభం 18% అప్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ జనవరి-మార్చి(క్యూ4) కాలానికి రూ. 2,278 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,928 కోట్లతో పోలిస్తే ఇది 18%పైగా వృద్ధి. ఇక నికర అమ్మకాలు సైతం దాదాపు 12% పెరిగి రూ. 9,145 కోట్లను దాటాయి. గతంలో రూ. 8,180 కోట్ల ఆదాయం నమోదైంది. స్టాండెలోన్ ఫలితాలివి. మొత్తం వ్యయాలు 8%పైగా తగ్గి రూ. 5,273 కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ తెలిపింది. సమస్యాత్మక బిజినెస్ వాతావరణంలోనూ మంచి ఫలితాలను సాధించగలిగినట్లు వ్యాఖ్యానించింది. కాగా, సిగరెట్లు తదితర ఎఫ్ఎంసీజీ బిజినెస్ ఆదాయం దాదాపు 13% ఎగసి రూ. 4,079 కోట్లకు చే రగా, సిగరెట్లేతర విభాగం నుంచి 14% అధికంగా రూ. 2,315 కోట్లు లభించింది. పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం 17% పుంజుకుని రూ. 8,891 కోట్లను అధిగమించింది. ఇక నికర అమ్మకాలు దాదాపు 12% ఎగసి రూ. 34,985 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 0.8% నష్టపోయి రూ. 342 వద్ద ముగిసింది.