సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద రియల్-ఎస్టేట్ డెవలపర్ జేపీ, ఢిల్లీలోని తన ముఖ్యమైన హైవేని అమ్మేస్తుంది. యమున ఎక్స్‌ప్రెస్‌వేను మరో డెవలపర్‌కు రూ.2500 కోట్లకు అమ్మేస్తున్నట్టు జేపీ ఇన్‌ఫ్రాటెక్ ప్రకటించింది. ఢిల్లీ నుంచి ఆగ్రాను కలిపే ఆరు వరుసల యమున ఎక్స్‌ప్రెస్‌వేను, జేపీ 2012లో నిర్మించింది. దీని ఖర్చు రూ.13వేల కోట్లు. ఈ ప్రాజెక్టులో కంపెనీకి వాటా ఉంది. టోల్ ద్వారా సేకరించిన నగదును ఈ కంపెనీనే పొందుతోంది.
30వేల మందికి పైగా ప్రజలకు ఫ్లాట్లు ఇవ్వకుండా దివాలా తీసిన క్రమంలో ఆ మొత్తాన్ని వారికి చెల్లించడానికి కంపెనీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫ్లాట్ ఓనర్ల ప్రయోజనాల మేరకు దివాలా తీసిన జేపీని ఈ నెల 27 వరకు రూ.2000 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఫ్లాట్ల ఓనర్లకు రీఫండ్ చేయొచ్చని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.500 కోట్ల రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను దివాలా తీయమని బ్యాంకులు కోరాయి. ఒక్కసారి కంపెనీ తాను దివాలా తీసినట్టు ప్రకటిస్తే, కొనుగోలుదారులకు తమ అపార్ట్‌మెంట్లు, పెట్టుబడులు వెనక్కి రావు. ఈ విషయంపై జేపీ కొనుగోలుదారులు కోర్టుకు ఎక్కారు.
Comments
Please login to add a commentAdd a comment