జియో ఎఫెక్ట్: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్స్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు మరో సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. టెలికాం రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో తక్కువ టారిఫ్ వోచర్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ప్రీపెయిడ్ వినియోగదారులకోసం కాల్ చార్జీలను భారీగా తగ్గించినట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది.
ప్రీ పెయిడ్ వినియోగదారుల కాల్ చార్జీలను తగ్గించామని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తన సరికొత్త రూ. 8 ఎస్.టి.వి (స్పెషల్ టారిఫ్ వోచర్) వోచర్‌పై బిజిఎన్ఎల్-టు-బిఎస్ఎన్ఎల్ కాల్ రేటును నిమిషానికి 15 పైసలకు తగ్గించామనీ , ఈ తక్కువ కాలింగ్ రేట్ ను ఆస్వాదించండంటూ బిఎస్ఎన్ఎల్ ట్వీట్ చేసింది.
30 రోజుల పాటు చెల్లుబాటయ్యే రూ. 8 స్పెషల్ వోచర్ పై బీఎస్‌ఎన్‌ఎల్ సొంత నెట్‌వర్క్‌లో నిమిషానికి 15పైసలు చార్జ్ చేస్తుంది. ఇతర నెట్ వర్క్‌లపై ని. 35పైసలు వసూలు చేయనుంది. అలాగే ఇవే కాల్ చార్జీలతో రూ.19 రీచార్జిపై 90రోజుల వాలిడిటీతో కూడా వోచర్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. మరిన్ని వివరాలకు కస్టమర్ కేర్ నంబర్ 1800-345-1500ను సంప్రదించాలని బీఎస్‌ఎన్‌ఎల్ కోరింది.
Enjoy #BSNL low calling rate on on-net and off-net STV. pic.twitter.com/jbB5lPOUP3
— BSNL India (@BSNLCorporate) September 6, 2017