భారత్‌లో ఏవియేషన్‌కి ఆద్యుడు జేఆర్‌డీ..
దేశీయంగా విమానయానానికి టాటాలే ఆద్యులు. ఎయిర్‌మెయిల్ సర్వీసుగా విమానయాన సంస్థను జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా (జేఆర్‌డీ టాటా) 1932లో ప్రారంభించారు. తొలి ఫ్లయిట్‌ను కరాచీ నుంచి ముంబైకి ఆయనే స్వయంగా నడిపారు. భారత్‌లో మొట్టమొదటి లెసైన్స్‌డ్ పైలట్ కూడా ఆయనే.
ప్రభుత్వం నుంచి అంతగా మద్దతు లభించకపోయినప్పటికీ క్రమక్రమంగా మెయిల్ కార్యకలాపాలను కలకత్తా, మద్రాస్, త్రివేండ్రం తదితర ప్రాంతాలకూ విస్తరించారు. 1937లో ఢిల్లీ-ముంబై రూటులో ఇటు మెయిల్, అటు ప్రయాణికులను కూడా చేరవేసేలా విమాన సర్వీసులను ప్రారంభించారు. 1946లో టాటా ఎయిర్‌లైన్స్ పబ్లిక్ కంపెనీగాను, ఆ తర్వాత ఎయిరిండియాగా మారింది. అయిదేళ్ల తర్వాత దాన్ని జాతీయం చేసినప్పటికీ.. 1978 దాకా జేఆర్‌డీనే చైర్మన్‌గా కొనసాగారు.