కెల్టన్ చేతికి బోకన్యి సంస్థ..! | Kellton Tech Solutions surges on acquiring US-based Bokanyi Consulting | Sakshi
Sakshi News home page

కెల్టన్ చేతికి బోకన్యి సంస్థ..!

Published Thu, Jan 28 2016 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

కెల్టన్ చేతికి బోకన్యి సంస్థ..!

కెల్టన్ చేతికి బోకన్యి సంస్థ..!

హైదరాబాద్: అమెరికాకు చెందిన క్లౌడ్, ఎనలిటిక్స్ సర్వీసెస్ సంస్థ. బోకన్యి కంపెనీని హైదరాబాద్‌కు చెందిన కెల్టన్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ కొనుగోలుకు కావలసిన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకున్నట్లు కెల్టన్ టెక్నాలజీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే పదవ వార్షికోత్సవం జరుపుకున్న బోకన్యి... గత ఏడాది 80 లక్షల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిందని కంపెనీ చైర్మన్ నిరంజన్ చింతమ్ పేర్కొన్నారు.

 తాము ఐఎస్‌ఎంఏసీ(ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్, సోషల్, మొబైల్, ఎనలిటిక్స్, క్లౌడ్) అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామనేది బోకన్యి కంపెనీ కొనుగోలు సూచిస్తోందని తెలిపారు. బోకన్యి కంపెనీ కొనుగోలుతో  ఈ అంశాల్లో తాము మరింత శక్తివంతం అవుతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement