రేపట్నుంచి హైదరాబాద్‌లో ఐసీఏఐ జ్ఞాన యజ్ఞ | knowledge yagna starts from tomarrow in hyderabad | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి హైదరాబాద్‌లో ఐసీఏఐ జ్ఞాన యజ్ఞ

Published Fri, Oct 21 2016 1:01 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

రేపట్నుంచి హైదరాబాద్‌లో ఐసీఏఐ జ్ఞాన యజ్ఞ - Sakshi

రేపట్నుంచి హైదరాబాద్‌లో ఐసీఏఐ జ్ఞాన యజ్ఞ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ) తలపెట్టిన అంతర్జాతీయ సదస్సు ‘జ్ఞాన యజ్ఞ’ ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించే ఈ సదస్సులో సుమారు 3,500 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఐసీఏఐ ప్రెసిడెంట్ ఎం.దేవరాజ రెడ్డి గురువారమిక్కడ విలేకరులతో చెప్పారు.

అంతర్జాతీయంగా అకౌంటింగ్ విధానాలు, దేశీ ప్రమాణాలను మెరుగుపర్చుకునే అంశాలు, జీఎస్‌టీ అమలు కానున్న నేపథ్యంలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర తదితర విషయాలపై ఇందులో చర్చించనున్నట్లు చెప్పారు. వివిధ రంగాల సంస్థల్లో చార్టర్డ్ అకౌంటెంట్ల అవసరాలు పెరుగుతున్న దరిమిలా ప్రస్తుతం 2.60 లక్షలుగా ఉన్న ఐసీఏఐ సభ్యుల సంఖ్య 2020 నాటికి ఆరు నుంచి పదిలక్షల దాకా పెరగగలదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అటు కోచింగ్ సెంటర్ల మాయమాటలతో ఔత్సాహిక విద్యార్థులు మోసపోకుండా ఉండేలా సీఏ కోర్సుపై అవగాహన పెంచేందుకు తామే ప్రత్యేకంగా కెరియర్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని దేవరాజ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement