ఎల్‌అండ్‌టీ ఈక్విటీ ఫండ్‌కు పదేళ్లు...
ముంబై: ఎల్‌అండ్‌టీ మ్యూచువల్ ఫండ్‌లో ప్రముఖ ఎల్‌అండ్‌టీ ఈక్విటీ ఫండ్ ప్రారంభమై పదేళ్లయ్యింది. భారత్ మార్కెట్‌లో ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అత్యధిక రాబడిని అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో 2005మేలో ఈక్విటీ ఫండ్ ప్రారంభమయ్యింది. ఈ పదేళ్లలో ఫండ్ దాదాపు 7 లక్షల మంది ఇన్వెస్టర్ల పెట్టుబడులను నిర్వహించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 10 సంవత్సరాలు ఫండ్‌లో ఉన్న ఇన్వెస్టర్లు మంచి ఆర్థిక ఫలితాలు పొందినట్లు వివరించింది. ఉదాహరణకు 2005 మే నెలలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసినవారికి 2015 మే నాటికి ఈ మొత్తం రూ.6.28 లక్షలకు పెరిగినట్లు ఎల్‌అండ్‌టీ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కులకర్ణి వివరించారు. చక్రగతిన వార్షిక రిటర్న్ 20 శాతమని తెలిపారు.