డీల్స్..
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ యూనిలీవర్ తాజాగా ఎయిర్ ఫ్యూరిఫయర్ వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నది. ఇందులో భాగంగా స్వీడన్‌కు చెందిన ఎయిర్ ఫ్యూరిఫికేషన్ సర్వీసులను అందించే ‘బ్లూఎయిర్’ కంపెనీని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.
ఐటీ దిగ్గజం విప్రో తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ... ఇన్‌సైట్స్ సైబర్ ఇంటెలిజెన్స్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఇన్‌సైట్స్ సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీలో 20 శాతం కంటే తక్కువ వాటాను 15 లక్షల డాలర్లతో కొనుగోలు చేశామని విప్రో తెలిపింది.
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ తాజాగా జేఎస్‌డబ్ల్యూ ప్రకై ్సర్‌లో అధిక వాటాను కైవసం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దాదాపు రూ.240 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ప్రకై ్సర్ ఆక్సిజన్‌లో 74 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ బీఎస్‌ఈకి నివేదించింది.
పిరమాల్ ఎంటర్‌ప్రెజైస్ కంపెనీ అమెరికాకు చెందిన కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ‘యాష్ స్టీవెన్స్’ను కొనుగోలు చేయనుంది. డీల్ విలువ 53 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.350 కోట్లు).
రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కు చెందిన ‘రిలయన్స్ బ్రాండ్స్’ తాజాగా ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ ‘స్కాచ్ అండ్ సోడా’తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. రిలయన్స్ బ్రాండ్స్ దేశంలోని అన్ని ప్రముఖ పట్టణాల్లో ‘స్కాచ్ అండ్ సోడా’ స్టోర్లను ఏర్పాటు చేస్తుంది. ఇది 2017 నాటికి పూర్తవుతుంది.
భారతి ఎయిర్‌టెల్ హోల్డింగ్ కంపెనీ అయిన భారతి టెలికంలో 7.39 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్(సింగ్‌టెల్) తెలిపింది. ఈ వాటాను 65.95 కోట్ల డాలర్లకు (రూ.4,400 కోట్లు) కొనుగోలు చేస్తామని పేర్కొంది. అలాగే థాయ్‌లాండ్ టెలికం కంపెనీ ఇన్‌టచ్ హోల్డింగ్స్ పీసీఎల్‌లో కూడా 21 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ రెండు వాటాల కొనుగోలు కోసం మొత్తం 180 కోట్ల డాలర్లు వెచ్చించనున్నామని, అంతా నగదులోనే చెల్లింపులు జరుపుతామని పేర్కొంది.
{పైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ తాజాగా ఎంఎంటీసీతో జతకట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా బ్యాంక్... ఇండియన్ గోల్డ్ కాయిన్లను (ఐజీసీ) తన కస్టమర్లకు ఆఫర్ చేయనుంది.టాటా గ్రూప్‌కు చెందిన వాహన విడిభాగాల కంపెనీ ‘టాటా ఆటోకాంప్ సిస్టమ్స్’ తాజాగా ఇంజిన్ కూలింగ్ సప్లయర్ ‘టైటాన్‌ఎక్స్’ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.