లక్ష కోట్లకు ‘ముద్రా’ రుణాలు! | Loans under Pradhan Mantri Mudra Yojana | Sakshi
Sakshi News home page

లక్ష కోట్లకు ‘ముద్రా’ రుణాలు!

Published Thu, Aug 20 2015 2:15 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

లక్ష కోట్లకు ‘ముద్రా’ రుణాలు! - Sakshi

లక్ష కోట్లకు ‘ముద్రా’ రుణాలు!

- 2015-16లో లక్ష్యంగా ప్రణాళికలు
- 10 రోజుల భారీ ప్రచారం త్వరలో
న్యూఢిల్లీ:
ప్రధాన మంత్రి ముద్రా యోజనా (పీఎంఎంవై)కు  విస్తృత ప్రాతిపదికన  ప్రాచుర్యం కల్పించాలని  కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) ముగిసేనాటికి ఈ పథకం కింద రుణ పంపిణీ రూ. లక్ష కోట్లకు చేరాలన్నది కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా రానున్న 10 రోజులు ఈ పథకంపై విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమం చేపట్టడానికి ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి హాస్‌ముఖ్ ఆథియా బుధవారం తెలిపారు.

ఈ పథకానికి సంబంధించి బ్యాంకులకు ఇప్పటికే లక్ష్యాలను నిర్దేశించినట్లు ఆయన పేర్కొన్నారు. లఘు పరిశ్రమల విభాగానికి రుణ సౌలభ్యం లక్ష్యంగా పీఎంఎంవైను రూపొందించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. చిరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు రూ.50,000-రూ. 10 లక్షల వరకూ రుణ సౌలభ్యతను కల్పించడం ముద్రా యోజన లక్ష్యం.  ఆథియా తెలిపిన సమాచారం ప్రకారం...

- ప్రారంభించిన  నాటినుంచీ 20 లక్షల మంది ప్రజలకు ఈ స్కీమ్ ద్వారా రూ.14,000 కోట్ల రుణ పంపిణీలు జరిగాయి.
- ఒక్క సెప్టెంబర్‌లోనే 20 నుంచి 25 లక్షల మంది కొత్త రుణాలు తీసుకునేట్లు ప్రచార కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
- రూ.11 లక్షల కోట్ల నిధిని వినియోగించుకుని 5.75 కోట్ల మంది స్వయం ఉపాధి పొందడంపై ముద్రా దృష్టి పెడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement