సాక్షి, ముంబై : వేలకోట్ల రూపాయల పీఎన్‌బీ స్కాంలో ప్రధాన నిందితుడు నీరవ్‌మోదీకి మహారాష్ట్రలో భారీ షాక్ తగిలింది. తమ భూములను అన్యాయంగా కాజేశాడని నీరవ్ మోదీని దుయ్యబట్టిన మహారాష్ట్ర రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమనుంచి అన్యాయంగా లాక్కున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకుని తిరిగి సాగులోకి తెచ్చుకోవాలని నిర్ణయించారు. తమ భూముల్లో తిరిగి పంటలు పండించు కుంమంటాంటూ దండుగా కదిలి వచ్చారు.
వేలకోట్లను రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్‌కి బుద్ధి చెప్పేందుకు మహా రైతులు సన్నద్దమయ్యారు. ఈ నేపథ్యంలో దాదాపు 200మంది రైతులు శనివారం ఎద్దుల బళ్లతో ర్యాలీగా కదలి వచ్చారు. తమ భూములను అక్రమంగా తక్కువ కొనుగోలు చేశారని అహ్మద్‌నగర్ జిల్లా రైతులు ఆరోపించారు. ఖండాలాలోని ఖజ్రత్ తెహిసిల్‌లోని దాదాపు 250 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామంటూ ఆందోళనకు దిగారు. అంతేకాదు ఈ భూముల స్వాధీనానికి సంకేతంగా కొంత భాగాన్ని ట్రాక్టర్లతో దున్నారు. స్వాధీనం చేసుకున్న భూమిలో త్వరలోనే సాగు మొదలు పెడతామని స్పష్టం చేశారు. స్థానిక కాలీ ఆయీ ముక్తి సంగ్రామ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకింగ్ వ్యవస్థపై కూడా రైతులు మండిపడ్డారు. అన్నదాతకు 10రూపాయల లోన్ ఇవ్వడానికి నానా అగచాట్లకు గురిచేసే బ్యాంకులు నీరవ్‌మోదీ లాంటి కేటుగాళ్లకు మాత్రం కోట్లకు కోట్లకు రుణాలిస్తున్నారని ధ్వజమెత్తారు.
కాగా 2013లో ఎకరాకు రూ.15వేలకు ఫైర్‌స్టార్ కంపెనీ పేరున నీరవ్ ఈ భూములను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ భూములకు ప్రభుత్వం రేటు ఎకరాకు రూ.2లక్షలు పలుకుతోందని న్యాయవాది, ఆందోళన కారుడు కర్భారి గవ్లి పేర్కొన్నారు. కాగా అది అనూహ్యమైన ఘటన అని కర్జాత్ పోలీస్ స్టేషన్ పోలీసులు నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment