reclaims
-
నీరవ్‌కు మరో భారీ షాక్!
సాక్షి, ముంబై : వేలకోట్ల రూపాయల పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు నీరవ్‌మోదీకి మహారాష్ట్రలో భారీ షాక్ తగిలింది. తమ భూములను అన్యాయంగా కాజేశాడని నీరవ్ మోదీని దుయ్యబట్టిన మహారాష్ట్ర రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమనుంచి అన్యాయంగా లాక్కున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకుని తిరిగి సాగులోకి తెచ్చుకోవాలని నిర్ణయించారు. తమ భూముల్లో తిరిగి పంటలు పండించు కుంమంటాంటూ దండుగా కదిలి వచ్చారు. వేలకోట్లను రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్‌కి బుద్ధి చెప్పేందుకు మహా రైతులు సన్నద్దమయ్యారు. ఈ నేపథ్యంలో దాదాపు 200మంది రైతులు శనివారం ఎద్దుల బళ్లతో ర్యాలీగా కదలి వచ్చారు. తమ భూములను అక్రమంగా తక్కువ కొనుగోలు చేశారని అహ్మద్‌నగర్ జిల్లా రైతులు ఆరోపించారు. ఖండాలాలోని ఖజ్రత్ తెహిసిల్‌లోని దాదాపు 250 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామంటూ ఆందోళనకు దిగారు. అంతేకాదు ఈ భూముల స్వాధీనానికి సంకేతంగా కొంత భాగాన్ని ట్రాక్టర్లతో దున్నారు. స్వాధీనం చేసుకున్న భూమిలో త్వరలోనే సాగు మొదలు పెడతామని స్పష్టం చేశారు. స్థానిక కాలీ ఆయీ ముక్తి సంగ్రామ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకింగ్ వ్యవస్థపై కూడా రైతులు మండిపడ్డారు. అన్నదాతకు 10రూపాయల లోన్ ఇవ్వడానికి నానా అగచాట్లకు గురిచేసే బ్యాంకులు నీరవ్‌మోదీ లాంటి కేటుగాళ్లకు మాత్రం కోట్లకు కోట్లకు రుణాలిస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా 2013లో ఎకరాకు రూ.15వేలకు ఫైర్‌స్టార్ కంపెనీ పేరున నీరవ్ ఈ భూములను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ భూములకు ప్రభుత్వం రేటు ఎకరాకు రూ.2లక్షలు పలుకుతోందని న్యాయవాది, ఆందోళన కారుడు కర్భారి గవ్లి పేర్కొన్నారు. కాగా అది అనూహ్యమైన ఘటన అని కర్జాత్ పోలీస్ స్టేషన్ పోలీసులు నివేదించారు. -
10వేలను అధిగమించిన నిఫ్టీ
ముంబై: తీవ్ర దోబూచులాటల మధ్య ఎన్ఎస్ఈ నిఫ్టీ మరోసారి చారిత్రక గరిష్టాన్ని అందుకుంది. అయిదు అంకెలకు చేరిన నిఫ్టీ 44 పాయింట్లు ఎగిసి 10008 వద్ద కొనసాగుతోంది. వరుసగా రెండో రోజుకూడా 10,000 పాయింట్ల చరిత్రాత్మక మైలురాయిని అందుకుని మదుపర్లను ఊరిస్తోంది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్ చరిత్రలో తొలిసారి 10,000 పాయింట్ల మైలురాయిని అందుకున్నా.. కొన్ని క్షణాల్లోనే వెనక్కి తగ్గింది. ట్రేడర్ల ప్రాఫిట్ బుకింగ్కారణంగా రెసిస్టెన్స్‌ను ఎదుర్కొంది. అటు దేశీయంగా నెలకొన్న సానుకూల సెంటిమెంటు కారణంగా మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ఇండెక్సులు కొత్త గరిష్టాలను అందుకుంటున్నాయి. సెన్సెక్స్ సైతం 128 పాయింట్ల లాభంతో 32,357 వద్ద ఉంది. మెటల్, రియల్టీ పాజిటివ్‌గా ఉండగా, ఫార్మా నష్టాల్లో ఉంది. ముఖ్యంగా వేదాంత భారీలాభాలతో మూడేళ్ల గరిష్టాన్ని నమోదు చేసి టాప్ గెయిన్గా ఉంది. టాటా స్టీల్, ఎంఅండ్ ఎం, జేపీ అసోసియేట్ జిందాల్ స్టీల్, సౌత్ఇండియన్ బ్యాంక్, సుజ్లాన్, జీఎస్ఎఫ్సీ, అదానీ పవర్, ముత్తూట్ ఫైనాన్స్, హెక్సావేర్, వీగార్డ్, గెయిల్ తదితర షేర్లు లాభపడుతున్నాయి. అయితే దివీస్, ఎంఆర్‌పీఎల్, శ్రేఈ ఇన్ఫ్రా, డాక్టర్ రెడ్డీస్, కేపీఐటీ, ఐడియా, రెప్కో హోమ్, పీఎఫ్సీ, నిట్ టెక్, టాటా కమ్యూనికేషన్స్ నష్టపోతున్నాయి. అయితే జూలై ఎఫ్‌అండ్‌వో సిరీస్‌లో మరోసారి 10వేల మార్క్‌ను అధిగమించడంతో సానుకూల సంకేతంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే జూలై ఎఫ్‌అండ్‌వో సిరీస్ ముగింపులో ఈ చారిత్రక గరిష్టాన్ని నిలబెట్టుకోవడంలో సఫల మవుతుందా అనేది టాక్ ఆఫ్ ది మార్కెట్. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు బలహీనంగా ఉన్నాయి. పది గ్రా. ధర రూ.153 పతనమైన రూ. 28, 325వద్ద కొనసాగుతోంది. -
జోరుగా స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీలాభాలతో ప్రారంభమయ్యాయి. బడ్జెట్, ఆర్బీఐ పాలసీ రివ్యూ నేపథ్యంలో మూడురోజుల కన్సాలిడేషన్ బాటలో సాగిన మార్కెట్లు గురవారం పాజిటివ్ నోట్‌తో మొదలయ్యాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా సాగుతున్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు పటిష్ట లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 161 పాయింట్ల లాభంతో 28,45 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 8,815 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాలూ లాభాల్లో కొన సాగుతున్నాయి. ముఖ్యంగా ఆర్బీఐ నిన్నటి పాలసీ రివ్యూ అనంతరం ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు మెరుపులు మెరిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, రియల్టీ రంగాలు పుంజుకున్నాయి. ఫలితాల అనంతరం హీరోమోటో, సిప్లా భారీ లాభాల్లో ఇంకా ఐసీఐసీఐ, ఓఎన్జీసీ,భారతి యాక్సిస్, అరబిందో, స్టేట్‌బ్యాంక్, టాటామెటార్స్ పవర్‌గ్రిడ్ ఉన్నాయి. దీంతో నిఫ్టీ 8800 ని అధిగమించి స్థిరంగా ట్రేడ్ అవుతుండటం విశేషం. భెల్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో ఉన్నాయి.