ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీలాభాలతో ప్రారంభమయ్యాయి. బడ్జెట్, ఆర్‌బీఐ పాలసీ రివ్యూ నేపథ్యంలో మూడురోజుల కన్సాలిడేషన్ బాటలో సాగిన మార్కెట్లు గురవారం పాజిటివ్ నోట్‌తో మొదలయ్యాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా సాగుతున్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు పటిష్ట లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 161 పాయింట్ల లాభంతో 28,45 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 8,815 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాలూ లాభాల్లో కొన సాగుతున్నాయి. ముఖ్యంగా ఆర్‌బీఐ నిన్నటి పాలసీ రివ్యూ అనంతరం ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు మెరుపులు మెరిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, రియల్టీ రంగాలు పుంజుకున్నాయి. ఫలితాల అనంతరం హీరోమోటో, సిప్లా భారీ లాభాల్లో ఇంకా ఐసీఐసీఐ, ఓఎన్జీసీ,భారతి యాక్సిస్, అరబిందో, స్టేట్‌బ్యాంక్, టాటామెటార్స్ పవర్‌గ్రిడ్ ఉన్నాయి.
దీంతో నిఫ్టీ 8800 ని అధిగమించి స్థిరంగా ట్రేడ్ అవుతుండటం విశేషం. భెల్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో ఉన్నాయి.
జోరుగా స్టాక్ మార్కెట్లు
Published Thu, Feb 9 2017 9:52 AM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM
Advertisement