మలేషియా ఎయిర్‌లైన్స్ క్రిస్మస్ ఆఫర్స్ | Malaysia Airlines Christmas Offers | Sakshi
Sakshi News home page

మలేషియా ఎయిర్‌లైన్స్ క్రిస్మస్ ఆఫర్స్

Published Sat, Dec 20 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

మలేషియా ఎయిర్‌లైన్స్ క్రిస్మస్ ఆఫర్స్

మలేషియా ఎయిర్‌లైన్స్ క్రిస్మస్ ఆఫర్స్

హైదరాబాద్: క్రిస్మస్ సందర్భంగా మలేషియా ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రత్యేకమైన చార్జీలను ఆఫర్ చేస్తోంది. ఈ ప్రత్యేకమైన చార్జీలను పొందడానికి టికెట్ల బుకింగ్ రెండు రోజులకే (నేడు- శనివారం, రేపు-ఆదివారం)  పరిమితమని మలేషియా ఎయిర్‌లైన్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలా బుక్ చేసుకున్న టికెట్లకు వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ప్రయాణించవచ్చని పేర్కొంది.

హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, కోచి నగరాల నుంచి మలేషియా నగరాలు-పుకెట్, పెనాంగ్, లంగ్‌కవి, క్రాబిలకు నేరుగా ప్రయాణించవచ్చని వివరించింది. తమ వెబ్‌సైట్(డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌మలేషియాఎయిర్‌లైన్స్‌డాట్‌కామ్) ద్వారా మరిన్ని వీకెండ్ డీల్స్ పొందవచ్చని పేర్కొంది. భారత్ నుంచి పుకెట్‌కు రూ.15,974, పెనాంగ్‌కు రూ.15,852, క్రాబికి రూ.14,390, లంగ్‌కవికురూ.14,274 (అన్నీ ఎకానమీ క్లాస్)చొప్పున ప్రత్యేకమైన చార్జీలను ఆఫర్ చేస్తున్నామని పేర్కొంది. ఈ ప్రత్యేక చార్జీల్లో విమానాశ్రయ పన్నులు, సర్‌చార్జీలు, 30 కేజీల చెక్-ఇన్ బ్యాగేజీ అలవెన్స్,,... ఇవన్నీ కలిసే ఉంటాయని మలేషియా ఎయిర్‌లైన్స్ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement