మారుతీ సియాజ్ ఇదిగో.. | Maruti Ciaz vs Honda City: Petrol Comparison Review | Sakshi
Sakshi News home page

మారుతీ సియాజ్ ఇదిగో..

Published Tue, Oct 7 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

మారుతీ సియాజ్ ఇదిగో..

మారుతీ సియాజ్ ఇదిగో..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి మిడ్ సైజ్ ప్రీమియం సెడాన్ సియాజ్‌ను దేశవ్యాప్తంగా సోమవారం విడుదల చేసింది. డీజిల్, పెట్రోల్ వర్షన్లలో లభించే ఈ కారు ధర వేరియంట్‌నుబట్టి హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో రూ.7.34-10.2 లక్షల మధ్య ఉంది. ఏ3+ విభాగంలో అధిక పొడవు, వెడల్పు ఉన్న మోడల్ ఇదేనని కంపెనీ చెబుతోంది.

ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, విశాలమైన లెగ్ రూమ్, భద్రత కోసం సుజుకీ టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీని వాడారు. మైలేజీ డీజిల్ వేరియంట్ 26.21, పెట్రోల్ అయితే 20.73 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. సియాజ్ అభివృద్ధికి రూ.620 కోట్లు ఖర్చు చేశారు. వెయిటింగ్ పీరియడ్ 8-10 వారాలు ఉంది.  

 15 లక్షల కస్టమర్లు..
 స్విఫ్ట్, డిజైర్ కస్టమర్లు 15 లక్షల మంది వరకు అప్‌గ్రేడేషన్ కోసం ఎదురు చూస్తున్నారని మారుతి సుజుకి డీలర్ డెవలప్‌మెంట్, సేల్స్ సపోర్ట్ వైస్ ప్రెసిడెంట్ పార్థో బెనర్జీ సోమవారమిక్కడ తెలిపారు. సియాజ్ విడుదల కార్యక్రమంలో కంపెనీ ప్రాంతీయ మేనేజర్ మునీష్ బాలితో కలిసి మీడియాతో మాట్లాడారు. పాత కస్టమర్ల ఆశలను సియాజ్ తీరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 10 వేలకుపైగా సియాజ్ బుకింగ్స్ నమోదయ్యాయని చెప్పారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నుంచి ఈ సంఖ్య 800పైగా ఉంది. ఎస్‌ఎక్స్4 మోడల్ ఉత్పత్తి నిలిపివేసినట్టు కంపెనీ తెలిపింది.

 ఆరేడేళ్ల తర్వాతే: కొద్ది కాలం క్రితం వరకు కస్టమర్లు నాలుగైదేళ్లకోసారి కారును మార్చేవారు. ఇప్పుడు ఆరేడేళ్లు అట్టిపెట్టుకుంటున్నారని పార్థో బెనర్జీ తెలిపారు. ఎకానమీ ఇంకా వృద్ధిబాటన పట్టలేదు. సెంటిమెంటూ బలహీనంగా ఉంది. కార్ల పరిశ్రమ మందగమనానికి కారణమిదే అని చెప్పారు. వడ్డీ రేట్లు తగ్గితే పరిశ్రమకు మేలు జరుగుతుందని అన్నారు.

 ఎంక్వైరీలు పెరుగుతున్నందున పండుగల సీజన్‌లో అమ్మకాల జోష్ ఉంటుందని పేర్కొన్నారు. 2014-15 తొలి అర్ధ భాగంలో కంపెనీ 15 శాతం వృద్ధి నమోదు చేసింది. రెండో అర్ధభాగంలోనూ అంతే వృద్ధిని ఆశిస్తోంది. నెలకు 10 కార్ల విక్రయాలు నమోదయ్యే అవకాశమున్న చిన్న పట్టణాల్లో కంపెనీ షోరూంలను తెరుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement