
సాక్షి, ఢిల్లీ : దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ తన లేటెస్ట్ హాచ్ బ్యాక్ ఎస్-ప్రెస్సో వాహనాన్ని ఈ నెల (సెప్టెంబర్) 30న లాంచ్ చేస్తోంది. ఈ మేరకు మారుతి కంపెనీ మీడియాకు ఆహ్వానాలు పంపుతోంది. ఇటీవల ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఎంట్రీ లెవల్ కారు గా దీన్ని ప్రదర్శించింది. నాలుగు వేరియంట్‌లలో ఈ కారును మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. మారుతి సుజుకి స్పోర్టీ లుక్‌లో వుస్తున్న ఎస్-ప్రెస్సో ఫీచర్లపై అంచనాలు ఇలా వున్నాయి. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, పవర్ 68హెచ్‌పి, టార్క్ 90 ఎన్‌ఎమ్, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. దీంతోపాటు సీఎన్‌జీ మోడల్‌ను కూడా ఆవిష్కరించనుంది. ఇక ధర విషయానికి వస్తే ప్రారంభ ధర రూ .4 లక్షలు నిర్ణయించవచ్చని అంచనా.