స్నాప్‌డీల్‌లో మైక్రోసాఫ్ట్ స్టోర్ | Microsoft Store in snapdil | Sakshi
Sakshi News home page

స్నాప్‌డీల్‌లో మైక్రోసాఫ్ట్ స్టోర్

Published Wed, Jun 17 2015 1:48 AM | Last Updated on Mon, Oct 22 2018 5:27 PM

స్నాప్‌డీల్‌లో మైక్రోసాఫ్ట్ స్టోర్ - Sakshi

స్నాప్‌డీల్‌లో మైక్రోసాఫ్ట్ స్టోర్

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్‌లో సాఫ్ట్‌వేర్ దిగ్గజం  మైక్రోసాఫ్ట్ సంస్థ తన బ్రాండెడ్ ఆన్‌లైన్ స్టోర్ ను ప్రారంభించింది. స్నాప్‌డీల్‌లో మైక్రోసాఫ్ట్ ఆన్‌లైన్ స్టోర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని స్నాప్‌డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్) టోనీ నవీన్ చెప్పారు. ఈ ఆన్‌లైన్ స్టోర్‌లో మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన ఫోన్లు, ట్యాబ్‌లు, పీసీలు, సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా కొనుగోళ్లు జరిపే వినియోగదారులు పెరుగుతున్నారని మైక్రోసాఫ్ట్ ఇండియా గ్రూప్ ఓఈఎం డెరైక్టర్ శర్లిన్ తాయిల్ చెప్పారు. తాము స్నాప్‌డీల్‌లో ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసిన స్టోర్ ద్వారా మంచి అమ్మకాలు సాధించగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement