Microsoft Corporation
-
మైక్రో ‘సాఫ్ట్ స్కిల్స్’లో మనమే మేటి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి విద్యార్థినీ అత్యుత్తమ నైపుణ్యాలతో ప్రపంచస్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు మరో మైలురాయిని అధిగమించాయి. ఉద్యోగాన్వేషణలో అత్యంత కీలకమైన సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించడంపై 1.62 లక్షల మంది విద్యార్థులకు ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ అందచేస్తున్న నేపథ్యంలో కోర్సు పూర్తి చేసినవారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విశాఖలో నిర్వహించే కార్యక్రమంలో సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నారు. రూ.465 కోట్ల వ్యయమయ్యే ఈ శిక్షణను మైక్రోసాఫ్ట్ సంస్థ రాష్ట్ర విద్యార్థులకు దాదాపు రూ.32 కోట్లకే అందిస్తుండడం విశేషం. అది కూడా విద్యార్థులపై నయాపైసా కూడా భారం లేకుండా ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు కీలక సంస్కరణలు తెచ్చి ప్రతి విద్యార్థీ చదువుకునేలా సీఎం జగన్ ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. వారి చదువులు ముగిసే నాటికి పూర్తి నైపుణ్యాలు అందుకునేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దేశంలో తొలి ప్రాజెక్టు మైక్రోసాఫ్ట్ అప్ స్కిల్లింగ్ ప్రపంచంలో అగ్రగామి ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ ద్వారా రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వం శిక్షణ అందచేస్తోంది. కరోనా సమయంలో సరైన బోధన, శిక్షణ అందుబాటులో లేక విద్యార్థుల్లో నైపుణ్యాలు కొరవడ్డాయి. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ అమెరికాలో చేపట్టిన వర్చువల్ శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సుల గురించి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఆ సంస్థతో సంప్రదింపులు జరిపారు. పరిమిత సంఖ్యలో కాకుండా అందరికీ శిక్షణ అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం జగన్ సూచించడంతో ఏకంగా 1.62 లక్షల మంది విద్యార్థులతో మైక్రోసాఫ్ట్ అప్ స్కిల్లింగ్ ప్రాజెక్టుకు ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ శ్రీకారం చుట్టాయి. దేశంలోనే ఇది తొలి ప్రాజెక్టు కావడం గమనార్హం. ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులతో పాటు నాన్ ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకూ శిక్షణ ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ (ఎంసీపీ), మైక్రోసాఫ్ట్ టెక్నికల్ అసోసియేట్ (ఎంటీఏ), మైక్రోసాఫ్ట్ ఫండమెంటల్ విభాగాల్లో 40 రకాల కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. లింక్డిన్తో 8 వేల కోర్సుల్లో ఉచిత శిక్షణ శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ కోర్సులే కాకుండా ‘లింక్డిన్’ ప్లాట్‌ఫాంతో అనుసంధానం చేస్తున్నారు. దీనిద్వారా లింక్డిన్లోని టెక్నాలజీ, క్రియేటివిటీ, బిజినెస్ విభాగాల్లో 8 వేలకు పైగా కోర్సులు విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. శిక్షణ పొందే విద్యార్ధికి మైక్రోసాఫ్ట్ సంస్థ వంద డాలర్ల విలువైన గిఫ్ట్ వోచర్లను కూడా అందిస్తోంది. మైక్రోసాఫ్ట్ అందించే కోర్సులతో పాటు ఇతర కోర్సుల కోసం, ల్యాబ్‌ల కోసం ఈ గిఫ్ట్ వోచర్ క్రెడిట్‌ను విద్యార్థులు వినియోగించుకోవచ్చు. అజూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అజూర్ వర్చువల్ మెషీన్స్, అజూర్ ఎస్‌క్యూఎల్ డేటాబేస్, యాప్స్ బిల్డింగ్ లాంవంటి కోర్సులకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణతో సంబంధం లేకుండా విద్యార్థులకు అవకాశం కలుగుతుంది. 35,980 మందికి ఇప్పటికే శిక్షణ గతేడాది చేపట్టిన మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్ ప్రాజెక్టు ద్వారా 1.62 లక్షల మందికి సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే 35,980 మందికి వర్చువల్ శిక్షణ పూర్తయింది. ఇతర విద్యార్థులకు శిక్షణ ప్రక్రియ పురోగతిలో ఉంది. 2022 అక్టోబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి విద్యార్థులను సాఫ్ట్ స్కిల్స్‌లో అత్యుత్తమంగా తీర్చిదిద్దనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.32 కోట్లను ప్రభుత్వమే భరిస్తున్నందున విద్యార్థులపై నయాపైసా కూడా భారం పడదు. ప్రభుత్వ చొరవతో... తొలిసారిగా తమ సంస్థ ద్వారా ఏకంగా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనలు రావడం మైక్రోసాఫ్ట్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ విధంగా ఏ ప్రభుత్వమూ ప్రయత్నాలు చేయలేదంటూ వెంటనే శిక్షణకు ముందుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ అజూర్ కోర్సు శిక్షణ కోసం ఒక్కో విద్యార్థికీ రూ.25 వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చు అవుతుంది. దీనికి అదనంగా పరీక్ష ఫీజు రూ.3,750 విద్యార్థే చెల్లించాలి. ఈ లెక్కన మొత్తం 1.62 లక్షల మంది విద్యార్ధుల శిక్షణ కోసం రూ.465 కోట్లు వ్యయమవుతుంది. అత్యుత్తమ అవకాశాలు అందుకునేలా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్ లాంటి అధునాతన సాంకేతికత అందుబాటులోకి వస్తున్న తరుణంలో మన విద్యార్థులకు ఆ దిశగాఅత్యుత్తమ నైపుణ్యాలు సమకూర్చేలా మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. దీనిద్వారా ఆయా రంగాల్లో అత్యుత్తమ అవకాశాలను అందుకొనేందుకు సిద్ధంగా ఉంటారు. మైక్రోసాఫ్ట్ సంస్థ అందించే ఈ సర్టిఫికేషన్ కోర్సులకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉండడంతోపాటు ఉపాధి త్వరగా లభిస్తుంది. మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. ఉద్యోగావకాశాలు పొందేలా విద్యార్థులను పూర్తి సామర్థ్యాలతో తీర్చిదిద్దుతుంది. – ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ రేపు విశాఖలో సర్టిఫికెట్లు అందించనున్న సీఎం జగన్ ఇప్పటికే దాదాపు 36 వేల మంది మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్ సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేసిన నేపథ్యంలో విశాఖపట్నంలో శుక్రవారం ఉన్నత విద్యామండలి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. శిక్షణ పూర్తి చేసిన వారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేయనుంది. -
యాపిల్ నెంబర్ 1 స్థానంపై కన్నేసిన మైక్రోసాఫ్ట్..!
మైక్రోసాఫ్ట్ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్ నెంబర్ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్ చతికిలపడిపోయింది. దీంతో మైక్రోసాప్ట్ మార్కెట్ క్యాప్ విలువ దాదాపు యాపిల్ క్యాప్ విలువకు చేరుకుంది. రిఫినిటివ్ డేటా ప్రకారం...మైక్రోసాఫ్ట్ షేర్లు 4.2శాతం పెరిగి రికార్డు స్థాయిలో 323.17 డాలర్ల వద్దకు చేరాయి. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్-కంప్యూటింగ్ వ్యాపారం బలమైన త్రైమాసిక వృద్ధికి ఆజ్యం పోసింది. దీందో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 2.426 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. మైక్రోసాఫ్ట్ షేర్లు గణనీయమైన వృద్ధిని సాధించాయి. ఈ ఏడాది షేర్లు సుమారు 45 శాతం మేర లాభాలను గడించాయి. కరోనా మహామ్మారి ఒక్కింతా మైక్రోసాఫ్ట్‌కు భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. మైక్రోసాఫ్ట్‌కు క్లౌడ్ ఆధారిత సేవలు భారీగా డిమాండ్ ఏర్పడడంతో భారీ లాభాలను సొంతం చేసుకుంది. చదవండి: టైటాన్ డబుల్ ధమాకా..! సప్లై చైన్ గండం..! రెండో త్రైమాసికంలో భారీగా లాభాలను ఆర్జించిన మైక్రోసాఫ్ట్‌ను సప్లై చైన్ విభాగం కలవరపెడుతోంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు, ఎక్స్‌బాక్స్ గేమింగ్ కన్సోల్‌లను ఉత్పత్తి చేసే యూనిట్లకు సరఫరా-గొలుసు సమస్యలు కొనసాగే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. యాపిల్ అంతంతే..! యాపిల్ తన త్రైమాసిక ఫలితాలను మంగళవారం రోజున ప్రకటించింది. యాపిల్ ఆశించిన మేర ఫలితాలు రాలేదు. త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన వెంటనే యాపిల్ షేర్లు గురువారం రోజున సుమారు 0.3 శాతం మేర క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సప్లై చైన్ సంక్షోభం ఐఫోన్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాపిల్‌ను చిప్స్ కొరత కూడా వెంటాడుతుంది. 2021లో యాపిల్ షేర్లు సుమారు 12 శాతం మేర పెరిగాయి. యాపిల్ స్టాక్ మార్కెట్ విలువ 2010లో మైక్రోసాఫ్ట్‌ను అధిగమించింది. రెఫినిటివ్ ప్రకారం... సగటున యాపిల్ క్యూ2లో 31 శాతం పెరిగి 84.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ రెండు కంపెనీలు ఇటీవలి సంవత్సరాలలో వాల్ స్ట్రీట్ అత్యంత విలువైన కంపెనీగా మారాయి. చదవండి: 2008లో టెస్లా కార్లపై ఎలన్ వ్యాఖ్యలు, ఇప్పుడు వైరల్ -
గేట్స్ గుండె తలుపులు తట్టిందెవరు?
మే 3న గేట్స్ దంపతులు విడాకులపై సంతకాలు పెట్టారు. 4న ఆ సంగతి ప్రపంచానికి చెప్పారు. 5న గేట్స్ దీర్ఘకాల ప్రియ స్నేహితురాలు యాన్ బిన్బ్లాడ్ పేరు బయటికి వచ్చింది! 6న గేట్స్ చైనీస్ ఇంటర్ప్రెటర్ ఝ షెల్లీ వాంగ్ పేరు గేట్స్‌తో జత అయింది!! ‘సర్ అలాంటివారు కారు..’ అని షెల్లీ అంటున్నా ఎవరూ నమ్మడం లేదు. ఒక భార్య, ఒక భర్త విడిపోయారంటే అందుకు మరొక మహిళే కారణమా!! 36 ఏళ్లు షెల్లీకి. చక్కగా, చలాకీ గా ఉంటారు. ‘నేను అలాంటి మనిషిని కాదు’ అనడం లేదు తను. గేట్స్ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు గేట్స్ కి యాన్ కి, గేట్స్ కి షెల్లీ కి మధ్య ఏముంది? వట్టి ప్రేమేనా? అంతకన్నా ఉన్నతమైన భావన ఏదైనానా?! నిజంగా గేట్స్ గుండెల్లో ఎవరైనా ఉన్నారా? లేక.. ఎవరో ఒకరు ఉండకపోతారా అని మీడియానే ఆయన గుండె తలుపుల్ని తట్టి చూస్తోందా?! భార్యాభర్తలుగా తామిద్దరం విడిపోతున్నట్లు బిల్ గేట్స్, మెలిందా గేట్స్ ప్రకటించగానే, అందుకు యాన్ విన్‌బ్లాడ్ అనే మహిళ కారణం అయుండొచ్చన్న ఊహా కథనాలు మొదలయ్యాయి. అయితే అవి కేవలం ఊహల ఆధారంగా అల్లుకున్నవి కావు. గేట్స్‌కి మెలిందా పరిచయం అవడానికి ఏడేళ్ల ముందు నుంచే యాన్.. అతడి గర్ల్ ఫ్రెండ్. చివరికి యాన్ అనుమతితోనే గేట్స్ మెలిందాను పెళ్లి చేసుకున్నారు. అదే అనుమతిని పెళ్లికి ముందే మెలిందా దగ్గర్నుంచి కూడా గేట్స్ తీసుకున్నారు... ఏడాదిలో ఒక వారం రోజులు యాన్‌తో కలిసి ఉంటానని!! యాన్ వయసిప్పుడు 70 ఏళ్లు. గేట్స్ కంటే ఐదేళ్లు పెద్ద. యాన్ విన్‌బ్లాడ్, ఝ షెల్లీ వాంగ్ ఇరవై ఏడేళ్లు కలిసున్నాక, ముగ్గురు పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఇప్పుడు గేట్స్ దంపతులు విడిపోవాలని గట్టి నిర్ణయం తీసుకోడానికి కారణంగా యాన్ విన్‌బ్లాడ్ తర్వాత బయటికి వచ్చిన ఇంకో మహిళ పేరు ఝ షెల్లీ వాంగ్! షెల్లీ చైనా యువతి. యాన్ కన్నా 35 ఏళ్లు, గేట్స్ కన్నా 30 ఏళ్లు చిన్న. ‘బిల్, మెలిందా గేట్స్ పౌండేషన్’లో ఆరేళ్లుగా చైనీస్ ‘ఇంటర్ప్రెటర్’గా ఉన్నారు. భాషల తర్జుమాల్లో ప్రవీణురాలు. ‘బిల్ గేట్స్ మిస్ట్రెస్ (ప్రియురాలు) ఈజ్ ఝ షెల్లీ వాంగ్ ఫ్రమ్ చైనా’ అని మే 6న మైఖైల్ డెలాజెన్ అనే యూజర్ నేమ్‌తో అకస్మాత్తుగా నెట్లో ఒక ట్వీట్ తలెత్తగానే.. తలలన్నీ యాన్ మీద నుంచి షెల్లీ వైపు తిరిగాయి! ‘‘సర్ అలాంటి వారు కారు. నమ్మండి. సర్‌తో, మేడమ్‌తో నాకున్న బాంధవ్యం ఉద్యోగానికి అతీతమైనదేమీ కాదు’’ అని చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘వైబో’లో షెల్లీ పెట్టిన పోస్ట్ గత రెండు రోజులుగా అక్కడ వైరల్ అవుతోంది. ఏమైనా ఇప్పుడు గేట్స్, మెలిందాలు వార్తల్లోంచి వెళ్లిపోయి, యాన్, షెల్లీలు.. వదంతులలోకి వచ్చారు. వాటిని విని యాన్ నవ్వుకుంటుంటే, షెల్లీ కంట తడి పెట్టుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఆమెకు వస్తున్న మెజేస్లలో ఇప్పుడు ఆమెను ఓదారుస్తున్నవే ఎక్కువ. ‘షెల్లీ గేట్స్ ప్రియురాలు’ అనే ట్వీట్ ప్రత్యక్షం కాగానే, ఆ మాటను రూఢీ పరిచే రీ ట్వీట్లూ మొదలయ్యాయి.‘‘ఇది చైనా కమ్యూనిస్టు పార్టీ పన్నిన కుట్రలా అనిపించవచ్చు. కామ్రేడ్ గేట్స్‌కి డబ్బు, మీడియా ప్రచారం అవసరం లేకున్నా.. ఒక స్త్రీని వద్దనుకోగలడా?’’ అనేది ఆ ట్వీట్లలో ఒకటి! అయితే గేట్స్ మరీ అంత అవసరంలో ఉంటాడని అనుకోడానికి ఒక్క కారణమూ లేదు. ఆయన జెంటిల్మన్ అయినట్లే, యాన్, షెల్లీ నైస్ ఉమెన్. యాన్ని మోసం చేసి ఆయన మెలిందాను పెళ్లి చేసుకోలేదు. ఎంతకూ పెళ్లి మాట ఎత్తకపోతుంటే.. ‘అలాగే ఆలోచిస్తూ ఉండు’ అని నవ్వుతూ యాన్ వేరే వ్యక్తిని వివాహమాడారు. గేట్స్ కూడా యాన్‌కు చెప్పకుండా మెలిందాను చేసుకోలేదు. ఆమె సంప్రదించాకే పెళ్లికి చొరవ చేశాడు! పెళ్లయ్యాక ఎప్పుడూ మెలిందా అనుమతి తీసుకోకుండా యాన్ని కలవలేదు గేట్స్. యాన్‌కి, గేట్స్ మధ్య అప్పటికీ ఇప్పటికీ ఉన్న బంధం అభిరుచుల అనుబంధమే తప్ప, హృదయ సంబంధం కాదు. యాన్ ఎలా చూసినా గేట్స్ కన్నా గ్రేట్. మైక్రోసాఫ్ట్ ఆరంభ సంవత్సరాలలో యాన్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆమె ఇబ్బడిముబ్బడిగా స్టార్టప్‌లకు డబ్బు పెడుతుంటారు. సొంత సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. పాతిక పైగా కంపెనీల ‘బోర్డ్’లలో ఆమె కీలక సలహాదారు. సిలికాన్ వ్యాలీలో తొలి మహిళా ప్రోగ్రామర్. ఇవన్నీ అటుంచితే.. అసలు గేట్స్‌కి, యాన్‌కి మధ్య ఏమున్నట్లు?! వాళ్లను ఎప్పటికీ కలిపి ఉంచేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. గేట్స్ మెలిందాతో ప్రేమలో పడటానికి ముందు యాన్ తో ప్రేమలో ఉన్న మూడేళ్లూ వాళ్ల డేటింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి బ్రెజిల్ వెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి బయో ఇంజినీరింగ్‌లో చిన్నపాటి అధ్యయనం చేశారు. ఇంకోసారి మరో దేశం వెళ్లారు. అక్కడ రిచర్డ్ ఫేవ్మన్ ప్రసంగాల ఆడియో టేప్‌లలో ఫిజిక్స్‌ను ఆస్వాదించారు. జాంజిబార్ వెళ్లినప్పుడు ప్రాచీన మానవ జీవన శాస్త్రాల పరిశోధకుడు డొనాల్డ్ జొహాన్సన్ పరిణామక్రమ సిద్ధాంతాల గురించి చదివారు! ఇదే వాళ్ల లైఫ్, లవ్! మెలిందాతో పెళ్లయ్యాక కూడా యాన్ని గేట్స్ కలుస్తున్నది ఇందుకోసమే. ఇక ఆమెవల్ల వీళ్లు విడిపోడానికి ఏముంటుంది?! మరి షెల్లీ కారణంగా గేట్స్ దంపతులు విడిపోయి ఉంటారా?! గేట్స్ అంత బలహీనమైన వారు కానీ, షెల్లీ అంత బలం లేని మహిళ కానీ కాదు. షెల్లీ చక్కగా ఉంటారు. చలాకీగా ఉంటారు. ఈ భార్యాభర్తల పౌండేషన్లోనే పని చేస్తున్నారు. క్షణం తీరిక ఉండని ఉద్యోగి ఆమె. నిజానికి మైక్రోసాఫ్ట్‌లో, గేట్స్ అండ్ మెలిందా ఫౌండేషన్‌లో వందల మంది షెల్లీలు ఉంటారు. ఎవరి ప్రపంచాలు వారివి. వాళ్లలో షెల్లీ ప్రపంచం కూడా ఒకటి. ఒకటి కాదు. చాలా! హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో కూడా ఆమె ఇంటర్ప్రెటర్గా పని చేస్తున్నారు. టి.ఇ.డి. కాన్ఫరెన్స్‌లకు వెళుతుంటారు. ‘మానిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్’లో కూడా పార్ట్ టైమ్‌గా వర్క్ చేస్తున్నారు. ఒక్కమాటలో గేట్స్ ఎంత బిజీగా ఉంటారో, గేట్స్ సంస్థలో పని చేస్తున్న షెల్లీ కూడా అంత బిజీగా ఉంటారు. బిజీగా ఉన్నంత మాత్రాన ఇద్దరి మధ్య ప్రేమ జనించకూడదా అనే ప్రశ్న రావచ్చు. వృత్తిని ప్రేమించేవారి దగ్గరికి ఒక ‘వ్యక్తిగా’ ప్రేమ ఎన్నటికీ దరి చేరలేదు. ‘‘భార్యాభర్తలుగా విడిపోతున్నా, ప్రొఫెషనల్స్‌గా మాత్రం మేము కలిసే ఉంటాం’’ అని బిల్ గేట్స్, మెలిందా చెప్పింది అందుకేనేమో! -
విండోస్ 10లోకి మారతారా.. లేదా?
మీ దగ్గర అధునాతన కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉందా? దాంట్లో ఓఎస్ ఏం వాడుతున్నారు? విండోస్ 7 గానీ, 8 గానీ వాడుతుంటే.. వెంటనే విండోస్ 10కు అప్‌గ్రేడ్ కావాలట. అందుకోసం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ విండోస్ యూజర్లను బలవంతపెడుతోంది. కోర్ ఐ3, ఐ5, క్వాల్కామ్ 8996 లాంటి ప్రాసెసర్లు ఉన్న యూజర్లందరూ తమ సిస్టంలను విండోస్ 10కు అప్‌గ్రేడ్ చేసుకోవాలని పదే పదే సందేశాలు వస్తున్నాయి. యూజర్లు విండోస్ అప్డేట్ను రన్ చేయడానికి ప్రయత్నిస్తే, కొత్త అప్డేట్లు రావడం లేదని, దానికి బదులు "కోడ్ 80240037 విండోస్ అప్డేట్ ఎన్కౌంటర్డ్ యాన్ అన్నోన్ ఎర్రర్'' అనే ఎర్రర్ సందేశం చూపిస్తోందని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త సాఫ్ట్వేర్లు, అప్లికేషన్లు వస్తుండటంతో వాటికి విండోస్ లేటెస్ట్ వెర్షన్ ఉంటేనే సపోర్ట్ చేస్తున్నాయని, అందువల్ల యూజర్లంతా వీలైనంత వరకు విండోస్ 10కు మారితేనే మంచిదని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు అన్నారు. పాత వెర్షన్లకు సపోర్ట్ ఇచ్చుకుంటూ పోవడం కంటే కొత్త వెర్షన్లో అయితే ఇప్పటికే సపోర్ట్ ఉన్నందున దానికి మారితే మేలని చెప్పారు. ఇప్పటికే ఎక్స్‌పీకి పూర్తిగా సపోర్ట్ తీసేసిన మైక్రోసాఫ్ట్.. ఇండోస్ 7కు కూడా కొంతకాలం తర్వాత సపోర్ట్ తీసేస్తామని ప్రకటించింది. ఈలోపే ఇప్పుడు విండోస్ 10కు మారాలంటూ చెబుతోంది. ఇంటెల్ స్కైలేక్ ప్రాసెసర్లు కూడా జూలై తర్వాత విండోస్ 7, 8ల మీద పనిచేయబోవని, అందువల్ల తప్పనిసరిగా యూజర్లు తమ ఆపరేటింగ్ సిస్టమ్‌ను మార్చుకోవాలని చెబుతున్నారు. -
ఏపీకి హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీ
హామీ ఇచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల దావోస్‌లో సీఎంతో సమావేశం సాక్షి, అమరావతి: హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్‌కు అందిస్తామని మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించినట్లు సీఎం కార్యాలయం (సీఎంవో) తెలిపింది. దావోస్‌లో మంగళవారం సీఎం చంద్రబాబుతో సమావేశమైన సత్య నాదెళ్ల సంబంధిత ప్రతిపాదనలపై చర్చించినట్లు పేర్కొంది. సీఎం కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం బాబు దావోస్ పర్యటన వివరాలివీ.. లింక్డ్ ఇన్ సంస్థను తాము కొనుగోలు చేశామని, దీనిపై సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు సత్య నాదెళ్ల సీఎంకు తెలిపారు. ఈ–గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో తమతో కలిసి పనిచేయాలని చంద్రబాబు కోరారు. వచ్చే ఏడాది జరిగే దావోస్ సదస్సు నాటికి హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీలో ప్రగతి సాధించాలని ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) 47వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం మంగళవారం వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీ సానుకూలతలపై వివరించారు. వర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చాన్స్‌లర్ నికోలస్ డక్స్‌తో సీఎం చర్చలు జరిపారు. ఏపీలోని మోరిలో బర్కెలీ వర్సిటీకి చెందిన సోలమన్ డార్విన్ చేస్తున్న కృషిని బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైపర్ లూప్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీ చైర్మన్ బిబాప్‌తో సమావేశమైన బాబు బుల్లెట్, స్పీడ్ రైళ్లలో ఆధునిక సాంకేతికత, ఇంధన విని యోగం మొదలైన అంశాలపై చర్చించారు. ఐచర్ మోటార్స్ ప్రతినిధి సిద్ధార్థ లాల్‌తో సమావేశమై ఏపీకి పెట్టుబడులతో రావాలని కోరారు. ‘ప్రిపేరింగ్ ఫర్ సిటీ సెంచురీ’ అనే అంశంపై దావోస్‌లో జరుగుతున్న చర్చలో సీఎం ప్రసంగించారు. గ్రీన్ అండ్ బ్లూ సిటీగా ఏపీ రాజధానిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దావోస్‌లో జరిగే సదస్సుకు సీఎం ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైనట్లు సీఎంఓ తెలిపింది. బాబుతో అజీం ప్రేమ్‌జీ, ముఖేశ్ అంబాని సమావేశమయ్యారు. -
సీఎం చంద్రబాబుతో సత్య నాదెళ్ల భేటీ
♦ గంటన్నర పాటు కొనసాగిన సమావేశం వివిధ అంశాలపై చర్చ ♦ మైక్రోసాఫ్ట్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ విషయంలో సీఎంవో తొట్రుపాటు! ♦ విశాఖలో ఏర్పాటుకు సత్య నాదెళ్ల అంగీకరించారని ముందు ప్రకటన ♦ అంతలోనే ఖండించిన మైక్రోసాఫ్ట్ వర్గాలు ♦ ప్రకటనను సవరించుకున్న సీఎం కార్యాలయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్యనిర్వహణ అధికారి సత్య నాదెళ్ల సోమవారం సమావేశం అయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీ దాదాపు గంటా ఇరవై నిమిషాల పాటు కొనసాగింది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం... ఐటీ వినియోగం ద్వారా ఏపీకి మైక్రోసాఫ్ట్ సంస్థ ఎలా సాయపడగలదన్న అంశంపై వీరు చర్చించారు. విద్య, వైద్య, వ్యవసాయ, పౌరసేవా రంగాల్లో ఏపీ త్వరితగతిన అభివృద్ధి చెందేందుకు అవసరమైన ఐటీ ఆధారిత సాంకేతిక సహకారాన్ని మైక్రోసాఫ్ట్ ఈ ఒప్పందం ద్వారా అందిస్తుంది. రూ. 2,500 కోట్ల విలువైన ఈ ప్రగతి ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు సత్య నాదెళ్ల ఆసక్తి కనపరిచారు. ఈ అంశంపై సమగ్ర ప్రణాళికతో సియాటిల్ను సందర్శించాల్సిందిగా సత్య నాదెళ్ల ఆహ్వానించగా నాలుగు వారాల్లో ప్రణాళిక సిద్ధం చేస్తామని అధికారులు చెప్పారు.అజూర్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ అండ్ పవర్ బీఐ టెక్నాలజీ విధానాన్ని విద్య, వ్యవసాయ రంగాల్లో వినియోగించుకుంటారు. అనంతపురం జిల్లాలో పర్యటించాల్సిందిగా సత్య నాదెళ్లను చంద్రబాబు ఆహ్వానించగా ఈసారి పర్యటిస్తానని హామీనిచ్చారు. ఈ సమావేశంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ హెడ్ అనిల్ బన్సాలీ, గవర్నమెంట్ బిజినెస్ హెడ్ నీరజ్ గిల్, ఏపీ ఐటీ కార్యదర్శి ఫణి కిషోర్ తదితరులున్నారు. సత్య హామీ ఇచ్చారు.. కాదు పరిశీలిస్తామన్నారు..! విశాఖపట్నంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్య నాదెళ్ల అంగీకారం తెలిపారంటూ సీఎంవో సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సత్య నాదెళ్లతో చంద్రబాబునాయుడు అల్పాహార విందు భేటీ అనంతరం సీఎం కార్యాలయం ఈ ప్రకటనను విడుదల చేసింది. ఇద్దరు లీడర్ల అపూర్వ కలయిక.. సీఎంతో సత్య నాదెళ్ల కీలక చర్చలు, ఇ-ప్రగతిలో భాగస్వామ్యానికి మైక్రోసాఫ్ట్ ముందడుగు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఒప్పందాలు, విశాఖలో మైక్రోసాఫ్ట్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు, త్వరలో సియాటిల్‌కు ఏపీ ఐటీ బృందం...అంటూ వార్తలు వచ్చాయి. అయితే... ఆ తరువాత కొద్ది సేపటికే రివైజ్డ్ పేరుతో అదే కార్యాలయం మరో ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో విశాఖలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటును ‘పరిశీలిస్తామని’ సత్య నాదెళ్ల హామీ ఇచ్చారని పేర్కొంది. మొదటేమో సత్య ఒప్పేసుకున్నారు.. అని ప్రకటన జారీ చేసి, ఆ తర్వాత మాత్రం పరిశీలిస్తామని మాత్రమే హామీ ఇచ్చారని ప్రభుత్వం తప్పును సరిదిద్దుకునే యత్నం చేసింది. సీఎంవో నుంచి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అంగీకారమని ప్రకటన వచ్చాకా..దాన్ని సవరిస్తూ పరిశీలన అని ప్రకటన రావడం వెనుక మైక్రోసాఫ్ట్ సంస్థ జోక్యమే కారణమని సమాచారం. తాము విశాఖలో ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు అంగీకరించలేదని, పరిశీలిస్తామని హామీ మాత్రమే ఇచ్చామని ఆ సంస్థ స్పష్టం చేయటంతో సీఎంవో తన తప్పును సవరించుకుని మరో ప్రకటన జారీ చేసింది. -
స్నాప్‌డీల్‌లో మైక్రోసాఫ్ట్ స్టోర్
న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్‌లో సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ తన బ్రాండెడ్ ఆన్లైన్ స్టోర్ ను ప్రారంభించింది. స్నాప్‌డీల్‌లో మైక్రోసాఫ్ట్ ఆన్లైన్ స్టోర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని స్నాప్‌డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్) టోనీ నవీన్ చెప్పారు. ఈ ఆన్లైన్ స్టోర్‌లో మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన ఫోన్లు, ట్యాబ్‌లు, పీసీలు, సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లు జరిపే వినియోగదారులు పెరుగుతున్నారని మైక్రోసాఫ్ట్ ఇండియా గ్రూప్ ఓఈఎం డెరైక్టర్ శర్లిన్ తాయిల్ చెప్పారు. తాము స్నాప్‌డీల్‌లో ఆన్లైన్లో ఏర్పాటు చేసిన స్టోర్ ద్వారా మంచి అమ్మకాలు సాధించగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
మైక్రోసాఫ్ట్ గివింగ్ క్యాంపెయిన్
మైక్రోసాఫ్ట్ సంస్థ గివింగ్ క్యాంపెయిన్ పేరిట పలు కార్యక్రమాలు చేపడుతోంది. మైక్రోసాఫ్ట్ సంస్థ 1983లో ‘గ్లోబల్ గివింగ్ ప్రోగ్రామ్’ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని 2000 సంవత్సరం నుంచి భారత్‌లో కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఈసారి కూడా మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (ఎంఎస్ఐడీసీ) దేశవ్యాప్తంగా తన ఉద్యోగులతో గివింగ్ క్యాంపెయిన్ చేపడుతోంది. ఈ క్యాంపెయిన్ లో తొలిరోజు.. ఈ నెల 17న డే ఆఫ్ కేరింగ్ జరుపుకొంది. డే ఆఫ్ కేరింగ్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో ఫొటోగ్రఫీపై ఆసక్తిగల వారు వివిధ ఎన్జీవోలను సందర్శించి, అవి చేపడుతున్న కార్యక్రమాల ఫొటోలు తీశారు. ‘గివింగ్ క్యాంపెయిన్’లో భాగంగా ఈ నెల 28న ‘గ్లోబల్ గివింగ్ ర్యాలీ’, ఈ నెల 31న 5కే రన్/వాక్ కార్యక్రమాలు చేపట్టనుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా గల మైక్రోసాఫ్ట్ ఉద్యోగులందరూ ‘గ్లోబల్ గివింగ్ ర్యాలీ’లో పాల్గొంటారు. ప్రపంచంలోని ప్రతి టైమ్జోన్లోనూ మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తమకు తోచిన రీతిలో పరుగు, ఈత, నడక, బైక్ ర్యాలీల్లో పాల్గొంటారు. ఇదిలా ఉండగా, ఈ నెల 31న మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ క్యాంపస్ నుంచి ఉద్యోగులు 5కే రన్/వాక్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను ఎల్వీ ప్రసాద్, శంకర నేత్ర చికిత్సాలయాలకు అందిస్తారు. - సిటీప్లస్ -
హైదరాబాదీ సత్య నాదెళ్లకు ఘన సన్మానం
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సీఈవో సత్య నాదెళ్ల సహా నలుగురు భారతీయ అమెరికన్లను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యూఎస్ ప్రభుత్వం శుక్రవారం ఘనంగా సన్మానించింది. కార్నెగీ కార్పొరేషన్ సహకారంతో న్యూయార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికాలో స్థిర పడిన భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సత్య నాదెళ్ల సహా ప్రముఖ హాస్య ప్రయోక్త, నటుడు ఆసిఫ్ మండ్వి, కార్నెగీ మెలాన్ వర్సిటీ అధ్యక్షుడు సుబ్రా సురేష్, వర్సిటీ ఆఫ్ వెస్ట్ జార్జియా మాజీ ప్రెసిడెంట్ బెహెరజ్ సెత్నాలు అమెరికాలో విశేష సేవలకు గుర్తింపుగా సన్మానించారు. వీరితోపాటు మరో 36 మందిని కూడా సత్కరించారు. హైదరాబాద్‌కు చెందిన సత్య నాదెళ్ల.. సాంకేతిక రంగంలో శక్తిమంతమైన నాయకుడిగా అనతి కాలంలోనే ఎదిగి రికార్డు సృష్టించారు. ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈవోగా పగ్గాలు చేపట్టారు. ముంబైకి చెందిన ఆసిఫ్ మండ్వి తొలుత ఇంగ్లాడ్‌కు వెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. ఇస్లాం, పశ్చిమాసియా, దక్షిణాసియాలపై తనదైన శైలిలో సైటర్లు వేసి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. చెన్నైకి చెందిన సుబ్రా సురేష్ కార్నెగీ మెలాన్ వర్సిటీ 9వ అధ్యక్షుడిగా ఎదిగారు. -
‘మైక్రోసా్‌ఫ్ట్’ పోటీల్లో వీఐటీ ప్రతిభ
వేలూరు: మైక్రోసాఫ్ట్ సంస్థ జరిపిన ఎమ్ఎస్ ఆఫీస్ నిపుణుల పోటీ ల్లో అంతర్జాతీయ స్థాయిలో వేలూరు వీఐటీ యూనివర్సిటీ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఐదుగురు విద్యార్థులు రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విద్యార్థులను వీఐటీ చాన్సలర్ విశ్వనాథన్ అభినందించారు. మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్‌వేర్‌లో విద్యార్థులను ఎంపిక చేసేందుకు కంప్యూటన్ అనే పేరుతో ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో ఎంపికైన విద్యార్థులను ప్రపంచ స్థాయిలో మైక్రోసాఫ్ట్ నిపుణులు అనే అవార్డును ప్రకటిస్తారు. ఈ ఏడాది ప్రపంచ స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులకు గత ఏప్రిల్‌లో పోటీలు నిర్వహించారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలోని మైక్రోసాఫ్ట్ కేంద్రం ఆధ్వర్యంలో జరిపిన ఈ పోటీల్లో బీటెక్, ఎంటెక్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివే విద్యార్థులు 72 మంది కలుసుకున్నారు. ఈ పోటీలకు ఎనిమిది మంది వీఐటీ విద్యార్థులు ఎంపికయ్యారు. న్యూఢిల్లీలోని న్యూయడోలో మే 30వ తేదీన అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వీఐటీలోని మైక్రోసాఫ్ట్ ఇనోవేషన్ సెంటర్ ప్రొఫెసర్ దినేష్, వీసుబ్రమణియన్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కళాశాలల నుంచి 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారికి మైక్రోసాఫ్ట్, ఇడియేషన్ ఫీస్ట్, ఆఫ్తాన్, హాక్‌తాన్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్లపై పరిశోధనలు చేశారు. ఈ పోటీల్లో వీఐటీకి చెందిన అరుణ్‌కుమార్ ఎమ్ఎస్ వరల్డ్‌లో రెండో స్థానం, కరుణ్ మాత్యూ ఎమ్ఎస్ పవర్ పాయింట్లో రెండో స్థానం లభించింది. సిద్దార్థాఫ్పా, శివం, ఆదిత్య, జ్ఞాన హిదితాలు సాధన చేశారు. సాధన చేసిన విద్యార్థులను వీఐటీ చాన్సలర్ విశ్వనాథన్, వైస్ చాన్సలర్ రాజు, ఉపాధ్యక్షులు జీవి సెల్వంలు అభినందించారు. -
ఇక నోకియా ఆండ్రాయిడ్ మొబైల్స్
బార్సిలోనా: ఎట్టకేలకు మొబైల్ దిగ్గజం నోకియా కూడా ఆండ్రాయిడ్ బాట పట్టింది. భారత్ వంటి ప్రధాన మార్కెట్లలో చౌక స్మార్ట్ఫోన్లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో తొలిసారిగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత మొబైల్స్‌ను తీసుకొచ్చింది. ఇక్కడ జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రదర్శనలో నోకియా ఈ కొత్త స్మార్ట్ఫోన్లను సోమవారం ఆవిష్కరించింది. మార్పులు చేసిన ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్( ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్-ఏఓఎస్‌పీ)తో ప్రవేశపెట్టిన ఈ మొబైల్స్‌కు ‘ఎక్స్’ సిరీస్‌గా పేరు పెట్టింది. ఎక్స్, ఎక్స్ ప్లస్, ఎక్స్ఎల్ అనే మూడు మోడళ్లు ఇందులో లభ్యమవుతాయి. వీటి ధరలు వరుసగా 89, 99, 109 యూరోలుగా ఉంటాయని(పన్నులు కలపకుండా) కంపెనీ వెల్లడించింది. అంటే ఎక్స్ మోడల్ రేటు భారత్ కరెన్సీలో దాదాపు రూ.7,600. చౌక స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో అనూహ్య వృద్ధి నమోదవుతున్న మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని ఎక్స్ సిరీస్‌ను ప్రవేశపెడుతున్నట్లు నోకియా డివెజైస్ అండ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్టీఫెన్ ఎలాప్ పేర్కొన్నారు. ఎక్స్ మోడల్‌ను త్వరలోనే మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నామని, మిగతా రెండు ఫోన్లను ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. మరో రెండు ఫోన్లు... ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఎంట్రీ లెవెల్ మొబైల్, ఆశా 230 పేరుతో మరో ఫోన్‌ను కూడా నోకియా ప్రవేశపెట్టింది. ఎంట్రీ లెవెల్ మొబైల్ ధర 29 యూరోలు కాగా, ఆశా 230 ఫోన్ 45 యూరోలకే లభిస్తుందని ఎలాప్ చెప్పారు. తక్షణం ఈ రెండు ఫోన్లను భారత్, ఆసియా-పసిఫిక్, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా తదితర మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆశా టచ్ ఫోన్లలో అత్యంత చౌక మొబైల్ ఇదేనని.. సింగిల్, డ్యూయల్ సిమ్ ఆప్షన్స్‌తో లభిస్తుందని ఎలాప్ వివరించారు. ఇప్పుడు నోకియా 220 వంటి ఎంట్రీ లెవెల్ ఫోన్‌తో పాటు ఆశా సిరీస్, ఎక్స్ సిరీస్, లుమియా... ఇలా నాలుగు స్థాయిల్లో తమ కంపెనీ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లయిందని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ హవాయే కారణం... ఆండ్రాయిడ్ ఓఎస్ హవాతో స్మార్ట్ఫోన్ల విభాగంలో నోకియా వెనుకబడిన సంగతి తెలిసిందే. దీంతో నోకియా ఆండ్రాయిడ్ మొబైల్స్ రావడం ఖాయమన్న వార్తలు ఇటీవల జోరందుకున్నాయి కూడా. ప్రస్తుతం నోకియా విండోస్ ఆధారిత స్మార్ట్ఫోన్లను(ప్రధానంగా లుమియా సిరీస్) మాత్రమే విక్రయిస్తోంది. నోకియాను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ 7.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం, మరికొద్ది రోజుల్లో ఈ టేకోవర్ పూర్తికానున్న నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్లను ప్రవేశపెట్టడం గమనార్హం. కాగా, ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) గణాంకాల ప్రకారం.. ఆండ్రాయిడ్ ఓఎస్‌తో గతేడాది డిసెంబర్ క్వార్టర్లో 78.1 శాతం స్మార్ట్ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైనట్లు అంచనా. ఇదే కాలంలో మైక్రోసాఫ్ట్ విండోస్ మొబైల్ ఓఎస్ ప్లాట్‌ఫామ్ ఉన్న స్మార్ట్ఫోన్లు విక్రయాలు 3 శాతమేనని గణాంకాలు చెబుతున్నాయి. బ్లాక్‌బెర్రీ మెసెంజర్ కూడా... విఖ్యాత బ్లాక్‌బెర్రీ మెసెంజర్(చాటింగ్ అప్లికేషన్-బీబీఎం) త్వరలో విండోస్ ఫోన్(లుమియా సిరీస్ ఇతరత్రా), నోకియా ఎక్స్ సిరీస్ స్మార్ట్ఫోన్లలోనూ లభించనుంది. గతేడాది అక్టోబర్‌లో ఈ కెనడా మొబైల్ దిగ్గజానికి చెందిన బీబీఎం యాప్‌ను ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్ డివైజ్‌లకు అనువుగా అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి దాదాపు 4 కోట్ల హ్యాండ్సెట్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు అంచనా. ‘నోకియా ఫోన్లో బీబీఎం యాప్‌ను ప్రీలోడెడ్‌గా అందించనుండటం పట్ల మేం చాలా ఉత్సుకతతో ఉన్నాం. కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో ఎక్స్ సిరీస్‌లో ఈ యాప్‌ను ముందుగా ప్రవేశపెడతాం. బీబీఎం సమూహంలోనికి నోకియా ఎక్స్ యూజర్లను ఆహ్వానిస్తున్నాం’ అని బ్లాక్‌బెర్రీ ప్రెసిడెంట్(గ్లోబల్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్) జాన్ సిమ్స్ పేర్కొన్నారు. శామ్సంగ్, యాపిల్, నోకియా స్మార్ట్ఫోన్లతో విపరీతమైన పోటీ కారణంగా బ్లాక్‌బెర్రీ అమ్మకాలు క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్స్ సిరీస్ ప్రత్యేకతలు ఇవీ... నోకియా ఎక్స్, ఎక్స్ ప్లస్‌లు రెండూ 4 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో లభిస్తాయి. వీటిలో వెనుకవైపున 3 మెగా పిగ్జెల్ కెమేరా ఉంది. ఎక్స్ ప్లస్‌కు 768 ఎంబీ ర్యామ్, ఎక్స్ మోడల్లో 512 ఎంబీ ర్యామ్‌ను అమర్చారు. ఎక్స్ ఎల్ మోడల్లో 5 అంగుళాల టచ్ స్క్రీన్, వెనుకవైపున 5 ఎంపీ ఆటోఫ్లాష్ కెమేరా, ముందువైపు 2 ఎంపీ కెమేరా ఉంది. ర్యామ్ 768 ఎంబీ. మూడు ఫోన్లలో డ్యూయల్ సిమ్ సౌకర్యం ఉంది. ఇంటర్నల్ మెమరీ 4జీబీ, 32 జీబీ వరకూ ఎక్స్‌పాండబుల్ సదుపాయం. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ డ్యూయల్ కోర్ 1 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌తో ఇవి లభిస్తాయి. మైక్రోసాఫ్ట్ సేవలు, హియర్ మ్యాప్స్ వంటి నోకియా ప్రత్యేక అప్లికేషన్స్‌తో పాటు వీటిలో ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కూడా పనిచేస్తాయి. -
ఉన్నత లక్ష్యం నిద్రపోనివ్వదు
సాక్షి, హైదరాబాద్: ‘ఉన్నత లక్ష్యం మనిషిని నిద్ర పోనివ్వదు. దాన్ని సాధించేవరకు వెంటాడుతూనే ఉంటుంది’ అని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. నానక్‌రాంగూడ ఐటీజోన్‌లోని మైక్రోసాఫ్ట్ సంస్థలో గురువా రం రాత్రి నిర్వహించిన శిక్షణా కార్యక్రమం ‘లీడర్షిప్’లో ఆయన ప్రసంగించారు. ఉన్నత లక్ష్యం, సాధించే తపన, మార్గాన్వేషణ, వైఫల్యాన్ని ఎదుర్కొనే ధైర్యం, నిర్ణయాధికారం, పారదర్శకత, పనిపై పరిపూర్ణ అవగాహన, ఉత్తమ నిర్వహణ, ఓర్పు... ఈ తొమ్మిది లక్షణాలున్నవారు ఉత్తమ నాయకులుగా ఎదగడానికి అవకాశముంటుందన్నారు. సమస్యలున్నవారు ప్రపంచమంతా ఉంటారని, కానీ లక్ష్యంతో ముందుకుసాగేవారు కొంతమందే ఉంటారన్నారు. వారే విజయం సాధిస్తారన్నారు. డీఆర్డీఏ, ఇస్రో శాస్త్రవేత్తగా పయనం, భారత రాష్ట్రపతిగా విధి నిర్వహణ.. ఇవన్నీ యాదృశ్ఛికంగా రాలేదని, వాటి వెనుక ఎన్నో ఎదురు దెబ్బలున్నాయన్నారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ డెవలపర్ డివిజన్ కార్పొరేట్ వైస్‌ప్రెసిడెంట్ ఎస్.సోమసెగర్ పాల్గొన్నారు. అంధత్వ నివారణకు మరింత కృషిచేయాలి బంజారాహిల్స్: శాస్త్రీయ పద్ధతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, గ్రామీణ ప్రాంతాల్లో అంధత్వ నివారణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో ప్రవేశపెట్టిన ‘సృ జన: ఇన్నోవేషన్ ఎల్వీపీఈఐ’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ ఎండోమెంట్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఐ కేర్, ఎంఐటీ మీడియా ల్యాబ్‌ల సహకారంతో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవడం అభినందనీయమని కలాం అన్నారు. దీని ద్వారా అంధత్వానికి గురవుతున్న చాలా మందికి లబ్ది చేకూరుతుందన్నారు. నేటి విద్యార్థుల్లోని సృజన వినియోగించుకొని, వారి ఆలోచనలు అమల్లో పెట్టడం ద్వారా మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు రూపొందించిన వివిధ నమూనాలను ఆయన పరిశీలించారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ గుళ్లపల్లి ఎన్. రావు మాట్లాడుతూ... ఎంఐటీలోని టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్, హైదరాబాద్‌లోని బిట్స్ పిలాని, పెర్కిన్స్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ ఈ వర్క్‌షాప్‌లో భాగస్వాములన్నారు. ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, సృజన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ డాక్టర్ వీరేంద్ర సంగ్వాన్, ఎంఐటీ మీడియా ల్యాబ్ అసోసియేట్ ప్రొఫెసర్ రమేష్ రస్కర్ పాల్గొన్నారు. -
స్పాట్లైట్
మూడు రెట్ల వేగవంతమైన ట్యాబ్లెట్లు గూగుల్, ఆపిల్లతో పోటీ పడే విధంగా సరికొత్త ట్యాబ్లెట్లతో దూసుకువచ్చింది అమెజాన్ సంస్థ. ప్రాసెసింగ్ స్పీడ్ విషయంలో మూడురెట్లు ఎక్కువ వేగవంతమైన కిండ్లేఫైర్ హెచ్‌డీఎక్స్ టాబ్లెట్‌ను అమెజాన్ ప్రవేశపెట్టింది. 7 ఇంచ్, 8.9 ఇంచ్‌ల వెర్షన్లో అందుబాటులో ఉంచింది. ప్రధానంగా లేటెస్ట్ ఐప్యాడ్‌తో పోటీ పడుతున్న ఈ ట్యాబ్లెట్లు షార్ప్‌నెస్ విషయంలో ఐప్యాడ్ కన్నా బెటర్. ఎక్కువ పిక్సల్స్ డిస్ప్లేతో ఉంటాయివి. కలర్ఫుల్గా ఉన్నాయన్న పేరును తెచ్చుకున్నాయి. 7 ఇంచ్ మోడల్ 8జీబీ వెర్షన్లో ప్రారంభధర 229 డాలర్లు. 8.9 ఇంచెస్ టాబ్లెట్ ధర 379 డాలర్లు. ఇంకా భారత మార్కెట్లోకి రాలేదు. అమెరికాలో అందుబాటులో ఉన్నాయి. 41 మెగాపిక్సల్స్‌తో లూమియా తాజాగా ఆవిష్కరించిన లూమియా 1020లో 41 మెగాపిక్సల్స్ కెమెరా ఉంటుందని ప్రకటించింది నోకియా. 8 ఎమ్పీ కెమెరాను చూస్తేనే ఆశ్చర్యపోతున్న దశలో ఏకంగా 41 ఎమ్పీ అంటే ఇంకెంత ఆశ్చర్యపోవాలో! స్మార్ట్‌ఫోన్‌లోనే ఉన్నత నాణ్యతతో ఉన్న కెమెరాలను కోరుకుంటున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని 41 మెగాపిక్సల్ కెమెరాను అందుబాటులోకి తీసుకొచ్చామని నోకియా పేర్కొంది. దీనిపై తమకు మంచి స్పందన వస్తోందని కూడా పేర్కొంది. అక్టోబర్ 11 నుంచి ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ధర సుమారు రు. 48 వేలు ఉంటుందని అంచనా. రేపటి తరం ట్యాబ్లెట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ సర్ఫేస్ 2, సర్ఫేస్ ప్రో 2 ట్యాబ్లెట్లను ఆవిష్కరించింది. నెక్ట్స్ జనరేషన్ ట్యాబ్లెట్లుగా పేరున్న ఇవి విండోస్ 8.1 ఓఎస్‌పై పనిచేస్తాయి. సర్ఫేస్ 2 ధర 359 డాలర్లు కాగా, ప్రో 2 ధర 719 డాలర్లు. ప్రీ ఆర్డర్స్ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. వచ్చే నెల 22 నుంచి ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇదివరకూ వచ్చిన సర్ఫేస్ ట్యాబ్లెట్లు మైక్రోసాఫ్ట్ కంపెనీని ఒకిత నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో చాలా మార్పులు తీసుకువచ్చి కొత్తసర్ఫేస్లను అందుబాటులోకి తీసుకవచ్చింది. పాత వాటితో పోలిస్తే బ్యాటరీ లైఫ్ విషయంలో 75 శాతం అభివృద్ధి పరిచామని, ప్రాసెసింగ్ స్పీడ్ విషయంలో 20 శాతం ఉన్నతిని సాధించామని మైక్రోసాఫ్ట్ ప్రకటించుకుంది. 4, 4ఎస్, 4జీ పోర్టబుల్ ఛార్జర్.. ఈ 1900 ఎమ్ఏహెచ్ ఛార్జింగ్ కేస్ కేవలం తెలుపు రంగులో మాత్రమే లభ్యమవుతుంది. లైట్ వెయిట్‌తో థిన్ డిజైన్‌తో ఉండే ఈ కేస్ కవర్ చేతికి మంచి గ్రిప్‌ను కూడా ఇస్తుంది. ఈ బాహ్యఛార్జర్లో బ్యాటరీ గురించి ముందస్తు అలర్ట్లుంటాయి. 25 శాతం బ్యాటరీ మిగిలి ఉందన్నప్పటి నుంచి అలర్ట్లుంటాయి. ధర ఆరు డాలర్లు అంటే సుమారు రు. 400 పోర్టబుల్ పవర్ ఛార్జింగ్ బ్యాకప్.. 180 గంటల స్టాండ్ బై తో, ఏడు గంటల పాటు ఫోన్ మాట్లాడుకోవడానికి తగిన ఛార్జింగ్‌ను అందిస్తుంది ఈ కేస్కవర్. రెడ్, రోజ్ రెడ్, ఖాకీ, పింక్, లెమన్ఎల్లో, బ్లూ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. 1900 ఎమ్ఏహెచ్ ఐ-పవర్ బ్యాకప్ కేస్ కవర్ ధర ఏడు డాలర్లు.