మైక్రోసాఫ్ట్ గివింగ్ క్యాంపెయిన్
మైక్రోసాఫ్ట్ సంస్థ గివింగ్ క్యాంపెయిన్ పేరిట పలు కార్యక్రమాలు చేపడుతోంది. మైక్రోసాఫ్ట్ సంస్థ 1983లో ‘గ్లోబల్ గివింగ్ ప్రోగ్రామ్’ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని 2000 సంవత్సరం నుంచి భారత్‌లో కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఈసారి కూడా మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (ఎంఎస్‌ఐడీసీ) దేశవ్యాప్తంగా తన ఉద్యోగులతో గివింగ్ క్యాంపెయిన్ చేపడుతోంది. ఈ క్యాంపెయిన్ లో తొలిరోజు.. ఈ నెల 17న డే ఆఫ్ కేరింగ్ జరుపుకొంది.
డే ఆఫ్ కేరింగ్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో ఫొటోగ్రఫీపై ఆసక్తిగల వారు వివిధ ఎన్జీవోలను సందర్శించి, అవి చేపడుతున్న కార్యక్రమాల ఫొటోలు తీశారు. ‘గివింగ్ క్యాంపెయిన్’లో భాగంగా ఈ నెల 28న ‘గ్లోబల్ గివింగ్ ర్యాలీ’, ఈ నెల 31న 5కే రన్/వాక్ కార్యక్రమాలు చేపట్టనుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా గల మైక్రోసాఫ్ట్ ఉద్యోగులందరూ ‘గ్లోబల్ గివింగ్ ర్యాలీ’లో పాల్గొంటారు. ప్రపంచంలోని ప్రతి టైమ్‌జోన్‌లోనూ మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తమకు తోచిన రీతిలో పరుగు, ఈత, నడక, బైక్ ర్యాలీల్లో పాల్గొంటారు. ఇదిలా ఉండగా, ఈ నెల 31న మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ క్యాంపస్ నుంచి ఉద్యోగులు 5కే రన్/వాక్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను ఎల్‌వీ ప్రసాద్, శంకర నేత్ర చికిత్సాలయాలకు అందిస్తారు.
- సిటీప్లస్