ఆ కంపెనీ నుంచి 4వేల మంది ఔట్‌ | Microsoft to cut 3,000 jobs to boost cloud growth | Sakshi
Sakshi News home page

ఆ కంపెనీ నుంచి 4వేల మంది ఔట్‌

Published Fri, Jul 7 2017 1:29 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

ఆ కంపెనీ నుంచి 4వేల మంది ఔట్‌

ఆ కంపెనీ నుంచి 4వేల మంది ఔట్‌

శాన్‌ఫ్రాన్సిస్కో : క్లౌడ్‌ బిజినెస్‌లపై ఎక్కువగా దృష్టిపెట్టిన టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ గురువారం ఉద్యోగాల కోతను ధృవీకరించింది. తమ కంపెనీ సేల్స్‌, మార్కెటింగ్‌ యూనిట్లలో అతిపెద్ద పునర్వ్యస్థీకరణ చేపడుతున్నట్టు తెలిపింది. ఈ ప్రభావంతో అమెరికా వెలుపల ఉన్న వ్యాపారాల సేల్స్‌ స్టాఫ్‌ 4వేల మందిని మైక్రోసాఫ్ట్‌ తొలగించనున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. ఈ ఉద్యోగాల కోత మొత్తం ఆ కంపెనీలో ఉన్న సేల్స్‌ ఫోర్స్‌లో 10 శాతం కంటే తక్కువేనని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్‌ తాజాగా చేపడుతున్న ఈ ఉద్యోగాల కోత ప్రభావం భారత్‌లో ఉంటుందా? లేదా? అనేది ఇంకా స్పష్టంకాలేదు.
 
తమ కస్టమర్లకు, భాగస్వాములకు మంచి సేవలను అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ మార్పులను చేపడుతున్నామని మైక్రోసాఫ్ట్‌ అధికార ప్రతినిధి తెలిపారు. నేడు తాము తీసుకునే చర్యలతో కొంత మంది ఉద్యోగులు తమ తమ స్థానాల నుంచి వైదొలగాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అన్ని కంపెనీల మాదిరిగానే తాము సాధారణ ప్రక్రియలో ఉన్న కొన్ని వ్యాపారాలను విశ్లేషిస్తున్నామని, ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు పెరుగుతాయని, అది ఇతరులపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కానీ ఎంతమందిని తీసివేస్తున్నామని ఆయన చెప్పలేదు. మైక్రోసాఫ్ట్‌ తాజాగా చేపడుతున్న ఈ పునర్వ్యస్థీకరణ ప్రక్రియలో 3000 నుంచి 4000 మంది ఉద్యోగులు సంస్థ నుంచి వైదొలగాల్సి ఉంటుందని తెలుస్తోంది.
 
మైక్రోసాఫ్ట్‌కు ఇటీవల క్లౌడ్‌, సర్వర్‌ వ్యాపారాల నుంచి అధికంగా రెవెన్యూలు వస్తున్నాయని వెర్జ్‌ రిపోర్టు చేసింది. సర్వర్‌ ప్రొడక్ట్‌లతో క్లౌడ్‌ సర్వీసుల రెవెన్యూలు 15 శాతం పైకి పెరిగాయని ఇది నివేదించింది. దాని క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అజ్యూర్‌ రెవెన్యూలైతే ఏకంగా 93 శాతం వృద్ధి సాధించాయి. ఈ వ్యాపారాలు అమెజాన్‌ వెబ్‌ సర్వీసులను సైతం బీట్‌ చేసి, క్లౌడ్‌ మార్కెట్‌లో రెవెన్యూ లీడర్‌గా నిలిచాయి. దీంతో కంపెనీ ఎక్కువగా క్లౌడ్‌ సర్వీసులపై దృష్టిసారించింది.  గతనెలలోనే మైక్రోసాఫ్ట్‌ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని ప్లాన్‌ చేస్తుందని టెక్‌ క్రంచ్‌ రిపోర్టు చేసింది. ఈ కంపెనీ గతేడాది జూలైలో  2,850 మంది ఉ‍ద్యోగులను తీసివేసిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్‌కు అమెరికాలో 71 వేల మంది ఉద్యోగులుండగా.. గ్లోబల్‌గా లక్షా 21వేల మంది ఉన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement