సంచలనాలకు సిద్ధమైన ఫేస్‌బుక్! | mind reading device will come to market soon | Sakshi
Sakshi News home page

సంచలనాలకు సిద్ధమైన ఫేస్‌బుక్!

Published Sun, Mar 26 2017 10:07 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

సంచలనాలకు సిద్ధమైన ఫేస్‌బుక్! - Sakshi

సంచలనాలకు సిద్ధమైన ఫేస్‌బుక్!

వాషింగ్టన్: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ మరో సంచలనానికి తెరలేపనుంది. త్వరలోనే నాలుగు కొత్త ఉత్పత్తులను వచ్చే నెలలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో ముఖ్యంగా ఓ ప్రొడక్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే.. వ్యక్తి ఆలోచనను పసిగట్టే పరికరాన్ని(మైండ్ రీడింగ్ డివైజ్) మార్కెట్లోకి తెస్తామని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ప్రకటించారు. వచ్చే నెలలోనే ఈ సస్పెన్స్‌కు తెర పడనుంది.

ఫేస్‌బుక్ సంస్థ గతేడాది 'బిల్డింగ్ 8' అనే పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే మనిషి మెదడు ఏం ఆలోచిస్తుంది, ఆ ఆలోచనలను, వాటి భావాలను పసిగట్టగలిగే 'మైండ్ రీడింగ్' డివైజ్ రూపకల్పనలో ఇంజినీర్లు బిజీగా ఉన్నారు. ఆలోచనను పసిగట్టిన డివైజ్ ఆ వివరాలను ఫోన్ ద్వారా ఇతరులకు చెప్పేస్తుంది. మిలియన్ల కొద్ది డివైస్‌లను ప్రపంచ వ్యాప్తంగా విక్రయించాలని కొన్ని కంపెనీలు ఫేస్‌బుక్‌తో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement