
ముంబై: దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మళ్లీ నిలిచింది. బ్రాండ్జ్ ఇండి యా టాప్ 50లో తొలి స్థానాన్ని వరుసగా ఐదో ఏడాది దక్కించుకుంది. నివేదిక ప్రకారం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బ్రాండ్ విలువ 21% వృద్ధి చెంది 2018లో 21.7 బిలియన్ డాలర్లకు చేరింది.
ఎల్‌ఐసీ 19.8 బిలియన్ డాలర్ల విలువతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. టీసీఎస్ (15 బి. డాలర్లు) మూడో స్థానంలో, ఫ్లిప్ కార్ట్ (4.1 బి.డాలర్లు) 11, పేటీఎం (4.1 బి.డాలర్లు) 12, జీటీవీ (3.8 బి.డాలర్లు) 15వ స్థానంలో టాప్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment