ముంబై : నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) ఆస్తులను, అన్న ముఖేష్ అంబానీ కొనుగోలు చేసేందుకు సిద్దమయ్యారు. ఆర్‌కామ్ ఆస్తులను రిలయన్స్ జియో కొనుగోలు చేయబోతున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్‌కామ్ తన అన్ని ఆస్తులను అమ్మేయాలనుకుంటే, వాటిని కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌జియో ముందంజలో ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. దీంతో పలు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ఇతర వ్యూహాత్మక పెట్టుబడిదారులు కలత చెందుతున్నట్టు కూడా పేర్కొన్నాయి. నావి ముంబైలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ(డీఏకేసీ) క్యాంపస్‌లో విదేశీ రుణదాతలతో కంపెనీ చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలిసింది.
రూ.19వేల కోట్ల విలువైన ఆర్‌కామ్ స్పెక్ట్రమ్‌ను రిలయన్స్ జియో కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతుందని, అదేవిధంగా ఆర్‌కామ్ టెలికాం టవర్ పోర్ట్‌ఫోలియోను దక్కించుకునే చర్చలు తుది దశలో ఉన్నట్టు కూడా సంబంధిత వర్గాలు చెప్పాయి. ఆర్‌కామ్‌కు మొత్తం 43,600 టవర్లున్నాయి. వీటి విలువ రూ.8వేల కోట్ల నుంచి రూ.9వేల కోట్ల వరకు ఉంటుంది. అంతేకాక రూ.1.72 లక్షల కిలోమీటర్ల ఆర్‌కామ్ దేశీయ ఫైబర్‌ను కూడా రిలయన్స్‌జియో కొనుగోలు చేయాలనుకుంటోంది. ఈ విషయంపై ఆర్‌కామ్, రిలయన్స్ జియో రెండూ కూడా స్పందించలేదు. మరోపక్క రుణదాత సంస్థలు ఆర్‌కామ్‌కు ఇచ్చిన రుణాలలో కొంతమేర ఈక్విటీగా మార్పు చేసుకునే అంశంపై ఈ వారంలో సమావేశంకానున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment