
న్యూఢిల్లీ: కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న క్రమంలో కొన్ని ఐటీ కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించాయి. ఉద్యోగుల తొలగింపు ఊహాగానాల నేపథ్యంలో ప్రముఖ ఉద్యోగ కల్పన సైట్ నౌక్రి.కామ్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 50,000 మంది పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది వ్యక్తులు ఉద్యోగుల ఉద్వాసనకు సంబంధించి స్పష్టమైన అభిప్రాయాన్ని తెలపలేదు. కాగా 40 శాతం మంది మాత్రం కంపెనీలు ఉద్యోగులను తొలగించే అవకాశం లేదని తెలిపారు. సర్వేలో పాల్గోన్న 50 శాతం మంది నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉపయోగించుకున్నామని తెలిపారు.
మరో 50 శాతం మంది తమకున్న ప్రత్యేక నేపుణ్యలపై శ్రద్ధ పెడతున్నామని తెలిపారు. కాగా ఐటీ, ఫార్మా, ఆరోగ్య రంగాలపై కోవిడ్ ఏ మాత్రం ప్రభావం చూపదని 29 శాతం మంది వ్యక్తులు అభిప్రాయపడ్డారు. మెరుగైన విద్యను అభ్యసించాలని 70శాతం వ్యక్తులు తెలిపగా. ఉద్యోగుల జీత భత్యాలలో కోత విధిస్తారని 16 శాతం వ్యక్తులు అభిప్రాయపడ్డారు. జీతాల చెల్లింపుల్లో ఏ మాత్రం పెంపుదల ఉండదని 63 శాతం మంది వ్యక్తులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment