ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిటైల్ రుణాల్లో 17–19 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఈ వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల మొత్తం రిటైల్ రుణాల పరిమాణం 2017 డిసెంబర్ నాటికి రూ.7 లక్షల కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 18.3 శాతం అధికం.
‘‘వాణిజ్య వాహనాలు, అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ (సూక్ష్మ రుణాలు), చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు ఇచ్చిన రుణాలు ఆరోగ్యకర స్థాయిలో పుంజుకోవడం వృద్ధికి కారణాలుగా పేర్కొంది. ఈ రుణాలు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల మొత్తం రుణాల్లో 60 శాతంగా ఉంటాయని ఇక్రా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఏఎం కార్తీక్ తెలిపారు. రుణాలకు వృద్ధి డీమోనిటైజేషన్ తర్వాత పడిపోయిన విషయాన్ని గుర్తు చేసింది. ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు స్వయం ఉపాధిలో ఉన్నవారు, చిన్న వ్యాపారులు ప్రధాన కస్టమర్లు అన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment