తగ్గనున్న చక్కెర ఉత్పత్తి: ఇక్రా
11 శాతం మేర పడిపోతాయంటూ జోస్యం
ముంబై: వర్షపాతం హెచ్చుతగ్గుల వల్ల చె రకు పంట దిగుబడి తక్కువగా వుండటంతో ఈ ఏడాది చక్కెర ఉత్పత్తి 11 శాతం మేర తగ్గనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈ సంవత్సరం 25.2 మిలియన్ టన్నుల లోటు ఉండొచ్చునని, ధరలు మాత్రం స్థిరంగా కొనసాగే వీలుందని పేర్కొంది. తద్వారా చ క్కెర ఎగుమతులపైన ప్రభావం చూపనుందని తెలిపింది. గత ఏడాది 9.5 మిలియన్ టన్నులు(ఎంటీ) ఎగుమతి కాగా ఇప్పుడు 7.6 ఎంటీలకు పడిపోయే ప్రమాదముందని చెప్పింది.
స్టాక్ దిద్దుబాట్లు, తప్పనిసరి ఎగుమతులు, చెరకు పంట దిగుబడి పై సబ్సిడీ పుణ్యమా అని గత ఆగస్టు నుంచి చక్కెర ధరలుపెరిగాయని గుర్తు చేసింది. చెరకు పండించే ప్రధాన ప్రాంతాల్లో కరువు సంభవించటం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని వెల్లడించింది. చ క్కెర ధరలు అమాంతం పెరిగి 2016 మే నాటికి టన్నుకు రూ.34 వేలకు చేరుకుంది. గత ఏడాది ధరతో పోలిస్తే 50 శాతం పెరిగిందని సంస్థ సీనియర్ సీనియర్ ఉపాధ్యక్షులు సబ్యసాచి మజుందర్ తెలిపారు.