సాక్షి, న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ దిగ్గజం యూనిటెక్ టేకోవర్‌పై సుప్రీంకోర్టు ఎన్‌సీఎల్‌టీకి అక్షింతలు వేసింది. అత్యున్నత కోర్టు విచారిస్తున్న కేసులో ఎన్‌సీఎల్‌టీ స్పందనపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఉత్తర్వులు ఎలా ఇస్తారని, ఇది చాలా డిస్టర్బింగ్ ఉందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. యునిటెక్ నుంచి గృహాలను కొనుగోలు చేసినవారి ప్రయోజనాలను ఎలా కాపాడాలనే దానిపై కోర్టుకు సూచించాలని కేంద్రాన్ని కోరింది.
యూనిటెక్ బోర్డు రద్దు, కొత్త కమిటీ ఏర్పాటు విషయంలో ఎన్‌సీఎల్‌టీ తమను సంప్రదించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. ఎన్‌సీఎల్‌టీ, మంత్రిత్వ శాఖ నిర్ణయంపై యూనిటెక్ సుప్రీంను ఆశ్రయించింది ఈ నేపథ‍్యంతో మంగళవారం యూనిటెక్ వాదనలను విన్న సుప్రీం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఎన్‌సీఎల్‌టీ, మంత్రిత్వ శాఖ సుప్రీం అనుమతి తీసుకోవాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఎన్ ఖాన్విల్కర్, డి.వై.చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అలాగే డిసెంబర్ చివరి నాటికి రూ.750కోట్లుచెల్లించాలని యూనిటెక్‌నుఆదేశించింది. బోర్డు డైరెక్టర్ల రద్దు అంశాన్ని రేపు (బుధవారం) విచారించనున్నట్టు వెల్లడించింది. మరోవైపు కేంద్రం యూనిటెక్ ఛాలెంజ్‌పై వాదనలను వినిపించేందుకు కేంద్రం గడువు కావాలని సుప్రీంను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment