లండన్/న్యూఢిల్లీ: విదేశాల్లోని మూడు హోటళ్ల విక్రయాలకు సంబంధించి మరో తాజా ఆఫర్‌నూ సహారా గ్రూప్ తిరస్కరించింది. ఇందుకు సంబంధించి బ్రిటన్ ఇతర పశ్చిమాసియా దేశాలకు చెందిన- 3 అసోసియేట్స్ కన్సార్షియం చేసిన 1.3 బిలియన్ డాలర్ల ఆఫర్‌ను తిరస్కరించినట్లు పేర్కొంది.
మూడు హోటళ్లలో ఒకటి లండన్‌లో (గ్రాస్‌వీనర్) ఉండగా, మరో రెండు న్యూయార్క్ ప్లాజా, డ్రీమ్ డౌన్‌టౌన్ (న్యూయార్క్)లో ఉన్నాయి. తాజా ఆఫర్‌ను ‘హోటళ్ల రేటు తగ్గించే ప్రయత్నంగా’’గా సహారా పేర్కొంది. అయితే తాము చేసిన ధర ప్రతిపాదన పూర్తి సమంజసమైనదేనని 3 అసోసియేట్స్ మేనేజింగ్ డెరైక్టర్ సాగర్ పేర్కొన్నారు. బ్రిటన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద హోటల్ బిడ్ అని, తాము తగిన ఆఫర్‌ను ఇచ్చామని తెలిపారు.