ఇండియాలోకి అడుగుపెట్టిన నివియా! | Nivea opens first plant in India, invests Rs850 crore | Sakshi
Sakshi News home page

ఇండియాలోకి అడుగుపెట్టిన నివియా!

Published Wed, May 6 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

ఇండియాలోకి అడుగుపెట్టిన నివియా!

ఇండియాలోకి అడుగుపెట్టిన నివియా!

రూ.850 కోట్ల పెట్టుబడులతో గుజరాత్‌లో ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జర్మన్ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ అయిన బైర్స్‌డోర్ఫ్ ఏజీ కంపెనీ ఇండియాలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ కంపెనీ నివియా బ్రాండ్ పేరుతో బాడీ, ఫేస్, లిప్ వంటి చర్మ సంబంధిత క్రీములను ఉత్పత్తి చేస్తోంది. జర్మన్ అంబాసిడర్ మిచెల్ స్టెన్నర్ గుజరాత్‌లోని సనంద్ ప్రాంతంలో తొలి తయారీ ప్లాంట్‌ను ప్రారంభించారు. రూ.850 కోట్ల పెట్టుబడులతో పెట్టిన ఈ ప్లాంట్‌కు ఏటా 100 మిలియన్ల చర్మ సంబంధిత క్రీములను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని నివియా ఇండియా ప్రై.లి. ఎండీ రక్షిత్ హర్గేవి ఓ ప్రకటనలో తెలిపారు. సమీప భవిష్యత్తులో ఈ ప్లాంట్ నుంచి సబ్బులు, డియోడ్రెంట్లను కూడా ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement