న్యూఢిల్లీ : రైళ్లలో దూరభార ప్రయాణాలు చేస్తున్న మీకు ఈ-కేటరింగ్ సర్వీసుల ద్వారా ఫుడ్ డెలివరీ సర్వీసులు అందడం లేదా? అయితే ఆందోళన చెందకండి. వెంటనే కేటరర్ చెత్త సర్వీసులు అందించినందుకు గాను, మీరు నష్టపరిహారాన్ని డిమాండ్ చేయండి. నష్టపరిహారం కింద రూ.100 డిస్కౌంట్ కూపన్‌ను రైల్వే ప్రయాణికులు కేటరర్ నుంచి పొందవచ్చని తెలిసింది. జూలై నుంచి దేశీయ రైల్వే ఈ రూ.100 డిస్కౌంట్ కూపన్‌ను నష్టపరిహారం కింద అందిస్తుంది. కేవలం క్షమాపణ చెప్పడం ఒక్కటే సరిపోదని, ప్రయాణికులకు అసౌకర్యం కల్గించినందుకు గాను, కేటరర్‌లు కొత్త ఖర్చు చెల్లించాల్సిందేనని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఈ డిస్కౌంట్ కూపన్‌ను ప్రయాణికులు తర్వాత ఆర్డర్‌లో రిడీమ్ చేసుకోవచ్చని కూడా తెలిపారు. ప్రయాణికులకు ఆహారం సరఫరా చేయడానికి 500 కేటరర్స్, రెస్టారెంట్లు, ఐఆర్‌సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుని పనిచేస్తున్నాయి. రిపోర్టు ప్రకారం ఐఆర్‌సీటీసీ వెస్ట్ జోన్ కింద జూలై నుంచి 85,496 ఆర్డర్లు వచ్చాయని తెలిసింది. అన్ని రైళ్లు ముంబై సెంట్రల్, బాంద్ర టెర్మినస్, ఎల్‌టీసీ, సీఎస్‌ఎంటీ, కల్యాన్ వంటివి ఐఆర్‌సీటీసీ వెస్ట్ జోన్ కిందకి వస్తాయి. ఇప్పటి వరకు రైల్వేలు 3154 మంది ప్రయాణికులకు ఈ కూపన్లు ఆఫర్ చేసింది. వీరిలో 195 మంది తమ కూపన్లను రిడీమ్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment