సాక్షి, బెంగళూరు: ఆన్‌లైన్ రీటైలర్ స్నాప్‌డీల్ ఖర్చులను , నష్టాలను తగ్గించుకునే పనిలో భాగంగా భారీగా ఉద్యోగులపై వేటు వేస్తే .తాజాగా మరో కంపెనీ ఈ కోవలోకి చేరింది. ఫ్యాషన్ రిటైలర్ వూనిక్ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ‘హర్ దిన్ ఫ్యాషన్ కరో’ నినాదంతో ఫ్యాఫన్ ప్రపంచంలోకి దూసుకొచ్చిన వూనిక్ తాజా నిర్ణయంతో సంస్థ ఉద్యోగులు డేంజర్ జోన్‌లో పడ్డారు. సుమారు 200 మంది ఉద్యోగులకు మూడు నెలలపాటు జీతాలు ప్రస్తుతానికి చెల్లించలేమని చేతులెత్తేసింది. అంతేకాదు అధిక జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులను తొలగించనుంది. టీం పునర్నిర్మాణంలో భాగంగా కొంతమందిపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది.
ఉద్యోగుల నిర్మాణంలో మార్పులు చేస్తున్నామనీ, అందుకే ఈ నిర్ణయమని వూనిక్ సీఈవో, కో ఫౌండర్ సుజయత్ ఆలీ సోమవారం ఒక సమావేశంలో చెప్పారు. గతంలో కూడా ఇలాంటి చర్య తీసుకున్నామని చెప్పారు. అయితే వాయిదా వేసిన వేతనాన్ని తిరిగి చెల్లిస్తామని తెలిపారు. కంపెనీనీ వీడిన ఉద్యోగులకు ఒకనెల జీతాన్ని చెల్లిస్తామని కంపెనీ సీఈవో వెల్లడించారు. ఎబిటా మార్జిన్లు బాగా పడిపోయాయని పేర్కొన్నారు.
దీంతోపాటు సంస్థలో పనిచేస్తున్న 350మంది ఉద్యోగుల్లో కొంతమందిపై వేటు వేయనుంది. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, కస్టమర్ సపోర్టు విభాగంలోని వారిని తొలగిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అలాగే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (రూసీ) తో దాఖలు చేసిన కంపెనీ రికార్డు ప్రకారం, వూనిక్ నష్టాలు పద్దెనిమిది రెట్లు పెరిగాయి.
గత ఏడాది వరకు నియామకాల్లో, మార్కెటింగ్, ప్రకటనల్లో జోరుగా భారీ మొత్తాలను ఖర్చు చేసిన వూనిక్ ఈ మధ్య కాలంలో ఇబ్బందుల్లో పడింది. అయితే కంపెనీ ఖర్చులను చాలా వరకు తగ్గించుకుందని సంస్థ సీఈవో అలీ చెప్పినప్పటికీ, కంపెనీలో భవిష్యత్తు అనిశ్చితిని దృష్టిలో ఉంచుకొని సీనియర్ స్థాయి ఉద్యోగులు కంపెనీని సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment