
సాక్షి, న్యూఢిల్లీ: నోకియా 105 (2019) ఫీచర్ ఫోన్‌ను భారతీయ మార్కెట్లలో మంగళవారం లాంచ్ చేసింది. మూడు రంగుల్లో (బ్లూ, బ్లాక్, పింక్) తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఫోన్ ధరను రూ.1190 గా నిర్ణయించింది. ఈ రోజు (మంగళవారం) నుంచే అందుబాటులో ఉంది.
నోకియా 105 ఫీచర్లు
1.77 అంగుళాల డిస్‌ప్లే
120x160 పిక్సెల్స్ రిజల్యూషన్
4ఎంబీ ర్యామ్, 4 ఎంబీ స్టోరేజ్
3.5 ఎంఎం ఆడియో జాక్
800 ఎంఏహెచ్ బ్యాటరీ
అలాగే రెగ్యులర్ క్లాసిక్ స్నేక్ గేమ్, ఎఫ్‌ఎం రేడియో ఫీచర్లను జోడించింది. ఒకసారి చార్జ్ చేస్తే 25 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. 2000 కాంటాక్టులు, 500 మెసేజ్‌లను స్టోర్ చేసుకోవచ్చని నోకియా తెలిపింది. ‘సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు’ నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. 14.4 గంటల టాక్ టైం, 25.8 రోజుల వరకు స్టాండ్‌బై ఈ ఫీచర్ ఫోన్ ప్రత్యేకత అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment