నోవార్టిస్‌తో టీ-హబ్ ఎంవోయూ
Published Thu, Feb 9 2017 4:17 PM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM
హైదరాబాద్: ఆరోగ్య రంగంలో సాంకేతికతను పెంచేదిశగా టీ-హబ్ నోవార్టిస్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్(ఎన్‌హెచ్‌పీఎల్)తో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. రాష్ట్రంలో హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌టెక్ అంశాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీహబ్‌తో కలిసి నోవార్టిస్ పనిచేస్తుంది. నోవార్టిస్‌కు చెందిన ఆరోగ్య, పరిశోధన, అభివృద్ధి రంగాల నిపుణులు టీ-హబ్ సమన్వయంతో స్టార్టప్ సంస్థలకు మార్గనిర్దేశం చేస్తారని టీ-హబ్ సీఈవో జే కృష్ణన్ తెలిపారు. ఫార్మారంగంలో మరిన్ని పరిశోధనలకు ఈ అవగాహన ఒప్పందంతో ఎంతో తోడ్పడుతుందని నోవార్టిస్ ప్రతినిధి సుబోధ్ దేశ్‌ముఖ్ తెలిపారు.
Advertisement
Advertisement