ఎన్‌పీఎస్ నుంచి ఎలా వైదొలగాలి? | nps how to get out? | Sakshi
Sakshi News home page

ఎన్‌పీఎస్ నుంచి ఎలా వైదొలగాలి?

Published Mon, Dec 1 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

ఎన్‌పీఎస్ నుంచి ఎలా వైదొలగాలి?

ఎన్‌పీఎస్ నుంచి ఎలా వైదొలగాలి?

నేను విదేశాల్లో పనిచేస్తున్నాను. వచ్చే ఏడాది రిటైరవుతున్నాను. నేను ఇప్పటివరకూ రూ. 10 లక్షల వరకూ పొదుపు చేయగలిగాను. రిటైరైన తర్వాత భారత్‌కు వచ్చి ఈ సొమ్ములను ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నెలకు రూ.15,000 ఆశిస్తున్నాను. నేను ఏ ఏ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలో సూచించండి?      
- మహ్మద్ రియాజ్, బెంగళూరు

 మీరు రూ.10 లక్షల ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నెలకు రూ.15,000 రాబడి  ఆశిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది అసమంజసమైన రాబడి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు నెలకు రూ.15,000 రావాలంటే సంవత్సరానికి రూ.1.8 లక్షలు ఆర్జించాలన్నమాట. అంటే మీకు స్థిరమైన వార్షిక రాబడి 18 శాతంగా ఉండాలి. కానీ సాధారణంగా స్థిరమైన వార్షికాదాయ రాబడి దీంట్లో సగం మాత్రమే (9 శాతం) ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్‌ఎస్)లో 9 శాతం వార్షిక రాబడులు వస్తాయి. అయితే వడ్డీ మూడు నెలలకొకసారి చెల్లిస్తారు. మీ ఇన్వెస్ట్‌మెంట్ విలువను కాపాడుకోవాలన్నా, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలన్నా మీకు 18 శాతం వార్షిక రాబడి కావాలంటే కొంచెం రిస్క్ చేయాల్సిందే. మీరు ఈ రూ.10 లక్షల మొత్తాన్ని ఎస్‌సీఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్ చేయండి. మూడు నెలలకొకసారి వచ్చే వడ్డీ మొత్తంలో కొంత మొత్తాన్ని మీ ఖర్చులకు ఉపయోగించుకోండి. మిగిలిన దానిని బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతున్న కొద్దీ, మీకు వీటి నుంచి కూడా ఆదాయం వస్తుంది.
 
ఈ ఏడాది నేను నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)లో ఇన్వెస్ట్ చేశాను. కానీ ఈ స్కీమ్‌లో కొనసాగాలనుకోవడం లేదు. ఈ స్కీమ్ నుంచి ఎలా వైదొలగాలో చెపుతారా?                  
- శ్రీలేఖ, విశాఖపట్టణం

నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్) అనేది స్వచ్ఛంద పెన్షన్ పథకం. ఈ స్కీమ్ టైర్ వన్, టైర్ టూ అని రెండు భాగాలుగా ఉంటుంది. టైర్ 1 అకౌంట్ అనేది తప్పనిసరి. దీని నుంచి వైదొలగడానికి లేదు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి రిటైరైన తర్వాత/ ఉద్యోగం నుంచి రాజీనామా చేసిన తర్వాత / లేదా మరణిస్తేనే ఈ అకౌంట్ నుంచి వైదొలగవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి   తన పింఛన్ విలువ మొత్తంలో కనీసం 80 శాతాన్ని లైఫ్ యాన్యూటీ కొనుగోలు కోసం 60 ఏళ్లకు  ముందే ఇన్వెస్ట్ చేయాలి. ఐఆర్‌డీఏ నియంత్రణలోని ఏ జీవిత బీమా సంస్థ నుంచైనా ఈ లైఫ్ యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. ఇక మిగిలిన 20 శాతం మొత్తాన్ని ఒకేసారి ఏకమొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక 60 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి   తన పింఛన్ విలువ మొత్తంలో కనీసం 40 శాతాన్ని లైఫ్ యాన్యుటీ కొనుగోలు కోసం ఇన్వెస్ట్ చేయాలి. ఐఆర్‌డీఏ నియంత్రణలోని ఏ జీవిత బీమా సంస్థ నుంచైనా ఈ లైఫ్ యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు.

ఇక టైర్ 2 అకౌంట్ అనేది స్వచ్ఛంద విత్‌డ్రాయల్ సేవింగ్స్ అకౌంట్. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ఎప్పుడైనా సొమ్ములను విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ విషయానికొస్తే, మీ టైర్ 1 అకౌంట్ నుంచి 20 శాతం మొత్తాన్ని మాత్రమే ఏక మొత్తంలో ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక టైర్ 2 అకౌంట్ నుంచి మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.

నేను కొన్ని మ్యూచువల్  ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. కానీ వాటి పనితీరు ఆశించిన విధంగా లేదు. ఈ ఫండ్స్ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తాన్ని ఉపసంహరించుకొని, మరో కొత్త ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఇలాగే ఉంచి, తాజాగా వేరే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా?     -
హిమాంశు జైన్, హైదరాబాద్

మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకనుగుణంగా మీ ఫండ్స్ పనితీరు ఉన్నాయా, లేదా అన్నది మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. దీంట్లో భాగంగా మీరు ఆశించిన విధంగా లేని ఫండ్స్ నుంచి మీరు వైదొలగడమే సరైన పని. ఇలా పనితీరు బాగాలేని ఫండ్స్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తాన్ని ఉపసంహరించుకొని, వేరే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ దగ్గర మిగులు నిధులు ఉంటే వాటిని కూడా ఈ కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
 
 ధీరేంద్ర కుమార్
 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement