
న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) చార్జీలను ఏకంగా 79 శాతం తగ్గించింది. గరిష్టంగా రూ. 4కి పరిమితం చేసింది. ఇప్పటిదాకా ఎంఎన్‌పీ పోర్టబిలిటీ గరిష్ట రేటు రూ. 19గా ఉంది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సర్వీస్ ప్రొవైడర్స్ (ఎంఎన్‌పీఎస్‌పీ) వ్యయాలు గణనీయంగా తగ్గడంతో పాటు ఎంఎన్‌పీ అభ్యర్ధనలు పెరిగిన నేపథ్యంలో పోర్టింగ్ లావాదేవీల చార్జీలను తగ్గించాలని నిర్ణయించినట్లు ట్రాయ్ తెలిపింది.
ఎంఎన్‌పీ చార్జీల సవరణపై డిసెంబర్‌లో ట్రాయ్ చర్చల ప్రక్రియ ప్రారంభించింది. 2015 జులై 3 నుంచి పెరిగిన పోర్టింగ్ అభ్యర్ధనలు, ఎంఎన్‌పీఎస్‌పీల ఆర్థిక ఫలితాలను బట్టి చూస్తే వ్యయాలు, చార్జీలపరంగా రూ. 19 గరిష్ట పరిమితి చాలా ఎక్కువేనని భావించిన ట్రాయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment