
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇప్పటివరకు రాష్ట్ర పరిధిలోనే ఉన్న పోర్టబిలిటీ విధానాన్ని అంతర్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. ఉపాధి పనుల నిమిత్తం మన రాష్ట్రం నుంచి తెలంగాణకు వలస వెళ్లిన పేదలకు అంతర్ రాష్ట్ర పోర్టబిలిటీ ఎంతో ప్రయోజనం కల్గిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఒక క్లస్టర్‌గా గుర్తించి ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా అమలైతే దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో రేషన్ కార్డులున్న 349 మంది తెలంగాణలో బియ్యంతో పాటు ఇతర సరుకులు తీసుకున్నారు.
తొలి రోజు 9.76 లక్షల మందికి..
► రాష్ట్రంలో 12వ విడత ఉచిత సరుకులు పంపిణీ ఆదివారం ప్రారంభమైంది. మొదటి రోజున 9.76 లక్షల మంది ఉచిత సరుకులు పొందారు.
► అంతర్ జిల్లాల పోర్టబిలిటీ ద్వారా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు చెందిన 1.34 లక్షల మంది బియ్యంతో పాటు శనగలు ఉచితంగా తీసుకున్నారు.
► ఈ విడతలో 1,50,80,690 బియ్యం కార్డుదారులకు ఒక్కో మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో చొప్పున శనగలు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment