ration portability system
-
మ‘కామ్’ మారింది!
సాక్షి, మెదక్: వారికి పట్నంలో పనిలేదు.. మనీ లేదు. ఉన్నపణంగా ఉపాధి పోయింది. ఉన్నట్టుండి రోడ్డున పడ్డారు. కుటుంబ పోషణ గగనమైంది. కరోనా కాటుకు వలసకూలీలు విలవిలలాడారు. కట్టుబట్టలతో, ఖాళీకడుపులతో ఊరిబాటపట్టారు. హైదరాబాద్ నగరంలో విపత్కర పరిస్థితులను తట్టుకోలేక సొంతూళ్లకు వచ్చిన చాలామంది స్థానికుల అండతో కొత్త ఉపాధిని వెతుక్కుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గినా పట్టణాలకు తరలిపోకుండా సొంత గ్రామం లేదా జిల్లాలో స్థిర నివాసం ఏర్పరచుకొని తోచిన వ్యాపారం చేస్తూ, కూలిపని చేసుకుంటూ కుటుంబాలను సాకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విద్యావంతులైన నిరుద్యోగులు పలువురు సొంతంగా చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకోగా ఇతరులు పలు షాపుల్లో పనులకు వెళ్తూ పొట్టపోసుకుంటున్నట్లు తెలుస్తోంది. రేషన్ పోర్టబిలిటీ లెక్కలే నిదర్శనం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఏ రేషన్ దుకాణం నుంచైనా రేషన్ సరుకులు తీసుకునే(పోర్టబిలిటీ) వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కలిపించని విషయం తెలిసిందే. కరోనాకు ముందు ప్రస్తుతం పోర్టబిలిటీ సేల్‌ను పరిశీలిస్తే అధిక మొత్తంలో ప్రజలు సొంతూళ్లలోనే ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మార్చి 22న జనతా కర్ఫ్యూ, వెంటనే లాక్డౌన్ అమల్లోకి రాగా ఆ తర్వాత విడతలవారీగా అన్‌లాక్ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో, ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్‌లో ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్‌డౌన్‌తో పనుల్లేక వలస కూలీలు సొంత జిల్లాలకు తరలివచ్చారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ స్థానికంగానే ఉపాధి పొందుతున్నారు. మెదక్ జిల్లాలో కరోనాకు ముందు ఫిబ్రవరిలో రేషన్ పోర్టబిలిటీ కింద 18,825 మంది ఇతర ప్రాంతాల లబ్ధి దారులు రేషన్ సరుకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 30,096కు చేరింది. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోనూ గమనించవచ్చు. -
పోర్టబులిటీ.. ‘వలస’పాలిట పెన్నిధి
సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థలో పోర్టబులిటీ సౌకర్యంతో లబ్ధిదారులు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఉచిత సరుకులు పొందుతున్నారు. ఉపాధి నిమిత్తం పనుల కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలకు పోర్టబులిటీ సౌకర్యం ఆదుకుంటోంది. ఈ విధానం వల్ల రాష్ట్రంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటు లభించింది. పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారికి కూడా ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ, కర్ణాటకల్లోనూ అంతర్రాష్ట్ర పోర్టబులిటీని అమల్లోకి తెచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు అక్కడే నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏప్రిల్ నుంచి నెలకు రెండు విడతల చొప్పున ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తోంది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ విడత ఉచిత సరుకుల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1.51 కోట్ల కార్డుదారులుంటే ఇప్పటికి 1.13 కోట్ల కుటుంబాలు ఉచిత సరుకులు అందుకున్నాయి. ఈ నెలలో పంపిణీ ప్రారంభమైన వారంలోనే(శనివారం నాటికి) 34 లక్షలకు పైగా కుటుంబాలు పోర్టబులిటీతో లబ్ధిపొందారు. 13వ విడతలో సరుకులు తీసుకున్న, పోర్టబులిటీతో లబ్ధి పొందిన కుటుంబాల వివరాలు (జిల్లాల వారీగా): జిల్లా సరుకులు తీసుకున్న కుటుంబాలు పోర్టబులిటీతో..లబ్ధి పొందిన కుటుంబాలు అనంతపురం 10,57,690 2,56,362 చిత్తూరు 9,59,828 1,71,568 తూ.గోదావరి 13,14,140 4,22,821 గుంటూరు 11,39,290 4,68,253 కృష్ణా 9,84,295 3,74,443 కర్నూలు 9,80,230 3,49,778 ప్రకాశం 7,89,353 2,02,858 శ్రీకాకుళం 1,97,250 1,595 నెల్లూరు 6,47,311 1,76,644 విశాఖపట్నం 10,53,722 3,75,345 విజయనగరం 6,02,782 92,375 ప. గోదావరి 9,91,955 3,29,270 వైఎస్సార్ కడప 6,78,163 1,83,813 మొత్తం 1,13,96,009 34,05,125 -
తెలంగాణలో ఉన్నా రేషన్
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇప్పటివరకు రాష్ట్ర పరిధిలోనే ఉన్న పోర్టబిలిటీ విధానాన్ని అంతర్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. ఉపాధి పనుల నిమిత్తం మన రాష్ట్రం నుంచి తెలంగాణకు వలస వెళ్లిన పేదలకు అంతర్ రాష్ట్ర పోర్టబిలిటీ ఎంతో ప్రయోజనం కల్గిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఒక క్లస్టర్‌గా గుర్తించి ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా అమలైతే దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో రేషన్ కార్డులున్న 349 మంది తెలంగాణలో బియ్యంతో పాటు ఇతర సరుకులు తీసుకున్నారు. తొలి రోజు 9.76 లక్షల మందికి.. ► రాష్ట్రంలో 12వ విడత ఉచిత సరుకులు పంపిణీ ఆదివారం ప్రారంభమైంది. మొదటి రోజున 9.76 లక్షల మంది ఉచిత సరుకులు పొందారు. ► అంతర్ జిల్లాల పోర్టబిలిటీ ద్వారా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు చెందిన 1.34 లక్షల మంది బియ్యంతో పాటు శనగలు ఉచితంగా తీసుకున్నారు. ► ఈ విడతలో 1,50,80,690 బియ్యం కార్డుదారులకు ఒక్కో మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో చొప్పున శనగలు కేటాయించారు. -
ఎక్కడ నుంచైనా రేషన్..వలసదారులకు వరం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్ సరుకులను ఎక్కడి నుంచైనా తీసుకునే విధానం (పోర్టబిలిటీ) వలసదారులకు వరంలా మారింది. ఉపాధి నిమిత్తం రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం పరిపాటి. ఇటువంటి వారికి పోర్టబిలిటీ విధానం ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. అలాగే, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుండి లక్షలాది మంది వలస వెళ్తున్నారు. ఇలాంటి వారికి కూడా ఆయా రాష్ట్రాల్లోనే సబ్సిడీ సరుకులు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పోర్టబిలిటీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో తెల్లరేషన్ కార్డులు కల్గి ఉండి తెలంగాణలో ఉంటున్న వారు ఈ–పాస్ ద్వారా సరుకులు తీసుకునే విధానాన్ని ఇటీవల ప్రయోగాత్మకంగా అమలుచేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రేషన్ తీసుకునే విధానం విజయవంతమైతే ఈ విధానాన్ని దేశమంతటా అమలుచేయనున్నారు. కాగా, ఏపీలోనే పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్న వారి సంఖ్య దాదాపు 30 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. ఈ విధానం దేశవ్యాప్తంగా అమలైతే రాష్ట్రానికి చెందిన మరికొందరికి లబ్ధి చేకూరుతుంది. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. వచ్చే నెల నుంచి ఇంటికే రేషన్ ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ నుంచి ప్రజా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానం అమల్లోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా.. 5, 10, 20 కిలోల బ్యాగుల ద్వారా బియ్యాన్ని లబ్ధిదారుల ఇళ్లకే గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. నూతన విధానం అమల్లోకి వచ్చినా వలస కూలీలు పోర్టబిలిటీ ద్వారా రేషన్ డీలర్ (స్టాకు పాయింట్లు) వద్దే సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఆ మేరకు ఈ–పాస్ మిషన్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేశారు. దీని ద్వారా ఎక్కడ, ఏ రేషన్ దుకాణంలో ఎంతమంది లబ్ధిదారులు సరుకులు తీసుకెళ్లారో ఆన్లైన్లో నమోదవుతుంది. కాగా, ఏదేని రేషన్ షాపులో 50 శాతం సరుకు పూర్తికాగానే సంబంధిత జిల్లా డీఎస్‌ఓలను అప్రమత్తం చేస్తూ కేంద్ర కార్యాలయం నుంచి మెసేజ్ వెళ్తుంది. తద్వారా సంబంధిత షాపులకు అదనంగా కోటాను అందుబాటులోకి తెస్తారు. -
ఆంధ్ర, తెలంగాణల్లో రేషన్ అనుసంధానం
కాకినాడ సిటీ: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులు పోర్టబులిటీ విధానంలో ఎక్కడి నుంచయినా సరుకులు తీసుకోవచ్చు. మన రాష్ట్రానికి చెందిన వ్యక్తులు వివిధ రాష్ట్రాలో ఉంటే వారు అక్కడే రేషన్ సరుకులు పొందేందుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మన రాష్ట్రానికి చెంది తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనుల కోసం వెళ్లిన వారు ఆ రాష్ట్రంలో ఎక్కడ ఉంటే అక్కడ రేషన్ సరుకులు తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసం ఆగస్టు 1 నుంచి ఈ పోర్టబులిటీ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో నిర్వహించేందుకు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రేషన్ పోర్టబులిటీ ద్వారా జిల్లాలో ఎక్కడి నుంచైనా చౌకధరల దుకాణాల నుంచి సరుకులు తీసుకునే వెసులుబాటు ఇప్పటికే ఉంది. దీని ద్వారా అర్హులైన ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న పేదవారు, ఉపాధి నిమిత్తం ఇతర ఊర్లకు, ప్రాంతాలకు వెళ్లిన కార్డుదారులకు ఉపయోగకరంగా ఉంది. ఇదే తరహాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు రేషన్ సరుకులు తీసుకునే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పరస్పర అంగీకారం ప్రాతిపదికన ఆ రాష్ట్రం వారు మన రాష్ట్రంలోను, మన వారు తెలంగాణలోనూ రేషన్ సరుకులు తీసుకునేలా నిర్ణయించారు. జిల్లా ప్రజలు ఉపాధి, ఇతర కారణాలతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్నారు. ఆ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల నుంచి వచ్చిన వారు మన జిల్లాలోని పలు పరిశ్రమల్లో పనులు చేసుకుని జీవిస్తున్నారు. కుటుంబాలకు కుటుంబాలే వలస వచ్చి ఉన్నారు. వారంతా వివిధ రేషన్ కార్డులు కలిగిన వారే. ఉపాధి కోసం వేర్వేరు జిల్లాల్లో, రాష్ట్రాల్లో ఉండటం వల్ల వారు రేషన్ సరుకులకు దూరం అవుతున్నారు. కొద్ది నెలలపాటు వాటిని తీసుకోకపోతే ఆయా కార్డులు రద్దు చేస్తున్న పరిస్థితులున్నాయి. ఈ సమస్యల నుంచి పరిష్కారం చూపడంతో పాటు జాతీయ ఆహార భద్రత చట్టం–2013ను పక్కాగా అమలు చేయడం, వారందరికీ నెలనెలా ఇబ్బంది లేకుండా సరుకులు అందించేలా, అంతరాష్ట్ర అనుసంధానం అమలు చేసేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందుకు సంబందించి ఇటీవలే కేంద్రం నుంచి కూడా అనుమతి వచ్చినట్టు డీఎస్ఓ డి.ప్రసాదరావు తెలిపారు. తెలంగాణలో ఉన్న మన జిల్లా వారికి అక్కడే రేషన్ సరుకులు అందించే ఈ కార్యక్రమం ఆగస్టు 1 నుంచే అమలు చేస్తారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు పౌరసరఫరాల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మన జిల్లా వారు ఎంత మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో అంచనాలు సిద్ధం చేశారు. వారందరి వివరాలనూ ప్రభుత్వానికి పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 16,43,584 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో అన్నపూర్ణ 1,320, అంత్యోదయ అన్న యోజన 83,120, తెలుపు రేషన్ కార్డులు 15,59144 ఉన్నాయి. వారందరి వివరాలనూ ప్రభుత్వానికి పంపారు. వీరిలో సుమారు 20 నుంచి 25 వేల మంది కార్డుదారులు తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి నిమిత్తం వెళ్లి ఉంటారని చెబుతున్నారు. అలాగే అక్కడి వారు మన జిల్లాలో 100 నుంచి 150 మంది వరకు ఉండవచ్చంటున్నారు. జిల్లాలో ఈ పోర్టబులిటీ విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా తెలంగాణ ప్రజలు మన జిల్లాలో ఉంటే వారిని గుర్తించాలని ఇప్పటికే జిల్లాలోని అందరు వీఆర్వోలకు సమాచారం అందించామన్నారు. ప్రస్తుతం నలుగురు వ్యక్తుల మాత్రమే కాకినాడ, కరప ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారని తెలిపారు. రాజమహేంద్రవరంలో తెలంగాణకు చెందిన వ్యక్తులు ఉండవచ్చని, ఆ దిశగా సర్వే జరుగుతోందన్నారు. మన జిల్లాకు చెందిన వారు ఆ రాష్ట్రంలో ఉంటూ, అక్కడ రేషన్ పొందాలంటే అక్కడ డీఎస్ఓ కార్యాలయం, సంబంధిత తహసీల్దారు, పౌరసరఫరాలశాఖ డిప్యూటీ తహసీలార్లకు దరఖాస్తు చేసుకోవాలని డీఎస్ఓ తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నుంచైనా రేషన్
సాక్షి, హైదరాబాద్ : ఇక రేషన్‌కు పరేషాన్ ఉండదు. నిరుపేదలకు నిట్టూర్పులు ఉండవు. సరుకుల కోసం నిర్దేశిత షాపు వద్దకే లబ్ధిదారులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సిన పనిలేదు. తెలుగురాష్ట్రాల్లో ఎక్కడినుంచైనా రేషన్ సరుకులు పొందవచ్చు. దేశవ్యాప్తంగా ‘ఒకే దేశం– ఒకే కార్డు’కింద నేషనల్ పోర్టబిలిటీ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టనుంది. దీనికి ఏపీ, తెలంగాణల నుంచే శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాంతాలకు వలసలు వెళ్లేవారి సౌకర్యార్థం ఈ విధానాన్ని చేపట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒక క్లస్టర్, గుజరాత్, మహారాష్ట్రలు మరో క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఆగస్ట్ ఒకటి నుంచి నేషనల్ పోర్టబిలిటీ విధానాన్ని అమలులోకి తేనుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ పంజగుట్టలోని ఒక రేషన్ షాప్‌లో శుక్రవారం పౌర సరఫరాల శాఖ నిర్వహించిన ట్రయల్‌రన్ విజయవంతమైంది. ఏపీ చెందిన ఇద్దరు లబ్ధిదారులు హైదరాబాద్‌లో సరుకులు తీసుకున్నారు. పోర్టబిలిటీ ట్రయల్‌రన్ విజయవంతం కావడంపట్ల పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ట్రయల్‌రన్’లబ్ధిదారులు – పంజగుట్టలోని షాప్ నంబర్ 1677750లో పౌర సరఫరాల శాఖ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈశ్వరరావు(కార్డు నంబర్ డబ్ల్యూఏపీ 048102580472), విశాఖపట్నం జిల్లా యలమంచిలికి చెందిన అప్పారావు (కార్డు నంబర్ డబ్ల్యూఏపీ 0034109700550) లబ్ధిదారులు సరుకులు తీసుకున్నారు. తెలంగాణే ఆదర్శం.. రాష్ట్రంలోని 2.82 కోట్ల లబ్ధిదారులు రాష్ట్రంలోని ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానాన్ని గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ విధానాన్ని ఇప్పటి వరకు 2.07 కోట్ల మంది లబ్ధిదారుల వినియోగించుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో 42 లక్షలు, మేడ్చల్ 29 లక్షలు, రంగారెడ్డి 18 లక్షలు, నిజామాబాద్ 10 లక్షలు, వరంగల్ 9 లక్షల మంది పోర్టబిలిటీ ద్వారా రేషన్ సరుకులను తీసుకున్నారు. ఈ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచింది. వచ్చే జూన్నుంచి దేశవ్యాప్తంగా... దేశానికి మోడల్‌గా నిలిచిన ఈ పోర్టబిలిటీ విధానాన్ని వచ్చే ఏడాది జూన్ నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్రం నిర్ణయించింది. ఇందుకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. -
రేషన్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు!
శ్రీకాకుళం: లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడకు సమీపంలోని చౌకధరల దుకాణం వద్ద రేషన్ సరుకులను తీసుకోగల సౌలభ్యం త్వరలో ఏపీలో అమలు కాబోతుంది. రేషన్ పోర్టబులిటీ విధానాన్ని ఈ పాస్ యంత్రాల ద్వారా అందుబాటులోకి తేనున్నామని రాష్ర్ట పౌర సరఫరాల సంస్థ కమిషనర్ బి.రాజశేఖర్ చెప్పారు. శనివారం శ్రీకాకుళం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఈ పాస్ విధానం క్రిష్ణా జిల్లాలో పూర్తి స్థాయిలో విజయవంతమైందని... అగస్టు నాటికి రాష్ర్ట వ్యాప్తంగా పోర్టబులిటీ సౌకర్యాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తాత్కాలికంగా వలస వె ళ్లినవారు, వేరే పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు తమ రేషన్ కోటాను ఉన్నచోటే పొందే అవకాశం దీని వల్ల లభిస్తుందన్నారు. ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, డీఎస్ఓ సీహెచ్ ఆనంద్‌కుమార్‌లు ఉన్నారు.