స్టాక్ మార్కెట్ రక్తమోడినా... | Over 200 stocks defy market bloodbath; trading in green zone | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ రక్తమోడినా...

Published Mon, Aug 24 2015 3:35 PM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM

స్టాక్ మార్కెట్ రక్తమోడినా...

స్టాక్ మార్కెట్ రక్తమోడినా...

ముంబై: స్టాక్ మార్కెట్లు రక్తమోడుతున్నా కొన్ని షేర్లు నిబ్బరంగా నిలబడ్డాయి. నష్టాల సునామీ చుట్టుముట్టినా దాదాపు 206 షేర్లు లాభాల బాటలో సాగాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలి ఇన్వెస్టర్లు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు.ఇంత పతనంలోనూ కొన్ని కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించడం విశేషం.

మ్యాగీ నూడుల్స్ తో వివాదాలపాలైన నెస్లే ఇండియా టాప్ గెయినర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇంట్రాడేలో నెస్లే ఇండియా షేర్లు 2 శాతం వరకు లాభపడ్డాయి. ఆరంభంలో రూ. 6100గా ఉన్న షేరు తర్వాత రూ.6,206కు పెరిగింది. వీడియోకాన్ ఇండస్ట్రీస్ వాటాలు 4.36 శాతం లాభపడ్డాయి. సన్ రైజ్ ఏషియన్, ఒరిసా స్పాంజ్ అండ్ ఐరన్, ఇమామీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, జిందాల్ వరల్డ్ వైడ్, బిన్నీ మిల్స్ తదితర షేర్లు లాభాలు ఆర్జించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement